షూటింగ్‌లో హీరో రామ్ పోతినేనికి గాయాలు.. #Rapo19 వాయిదా!

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ పోతినేని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందిస్తున్నాడు. ఇక ఈ నటుడు ప్రస్తుతం తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కూడా చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం కోసం చాలానే కష్ట పడుతున్నారు.

ఇక రీసెంట్ గా రామ్ ఆ సినిమా కోసం హార్డ్ వర్క్ చేయలనుకోగా సడన్ గా గాయపడినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది. అయితే కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని కూడా అతని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

మాస్ హీరోగా.. సరికొత్తగా

మాస్ హీరోగా.. సరికొత్తగా

రామ్ పోతినేని ఇటీవల కాలంలో తన సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో రామ్ పోతినేని ఊరమాస్ స్టైల్లో తన అభిమానుల సంఖ్య మరింత పెంచుకున్నాడు. రామ్ లో అంతటి మా హీరో ఉన్నాడని కూడా అప్పటి వరకు ఎవరు ఊహించలేదు.

ఎక్కువగా అలాంటి కథలు

ఎక్కువగా అలాంటి కథలు

రామ్ పోతినేని ఇలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద అయితే మినిమమ్ వసూళ్లను అందుకుంటున్నాయి. ఒక విధంగా నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మంచి ప్రేమ కథలు దొరికితే రామ్ ను వెంటనే సెలక్ట్ చేసుకోవాలని చాలా మంది దర్శకులు కోరుకుంటారు. ఇక ఇప్పుడు తనలోని మాస్ ఎలిమెంట్స్ ని కూడా బయటపెట్టడంతో అదే తరహా కథలు కూడా ఎక్కువగా వస్తున్నాయట.

కెరీర్ లోనే బిగ్ బడ్జెట్

కెరీర్ లోనే బిగ్ బడ్జెట్

ప్రస్తుతం రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త స్టైల్ లో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా రామ్ కెరీర్లోనే ఈ సినిమాకు అత్యధిక బడ్జెట్ ను కేటాయించారు. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకొని తన స్థాయిని మరింత పెంచుకోవాలని కూడా ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాడు. సినిమాపై అభిమానుల్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

మెడకు గాయం..

మెడకు గాయం..

ఇక అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా దర్శకుడు లింగుస్వామి ఎలాగైతే కష్టపడుతున్నాడో రామ్ పోతినేని కూడా అదే తరహాలో హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా జిమ్ లో బాగా వర్కౌట్ చేస్తున్న రామ్ సడన్ గా గాయపడ్డాడు. మెడకు గాయం అయినట్లు తెలుస్తోంది. నరం కూడా పట్టుకోవడంతో కొంత సేపటి వరకు రామ్ ఇబ్బంది పడ్డాడు. ఇక వెంటనే తన పర్సనల్ డాక్టర్ ను సంప్రదించి రామ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
షూటింగ్ వాయిదా

షూటింగ్ వాయిదా

ఇక ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని మరికొన్ని రోజుల్లో ఎప్పటిలానే షూటింగ్ పనులతో కూడా బిజీ అవుతాడని అతని సన్నిహితులు తెలియజేశారు. అయితే రామ్ కొంత కొలుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ సలహా ఇవ్వడంతో లింగుస్వామి షూటింగ్ పనులను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇక రామ్ మరో కొత్త సినిమాపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X