వెంకీ కూతురు అత్తగారి ఫ్యామిలీ ఇదే, కనువిందు చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ (ఫోటోస్)
విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం వినాయక్ రెడ్డితో మార్చి 24న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్‌లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు బిగ్ షాట్స్ పాల్గొన్నారు.
వినాయక్ రెడ్డి తాత రామసహాయం సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పెళ్లి అనంతరం... దగ్గుబాటి కుటుంబం, రామసహాయం ఫ్యామిలీ ఫోటోస్ విడుదలయ్యాయి.

నవ దంపతులు ఆశ్రిత, వినాయక్
నూతన దంపతులు ఆశ్రిత, వినాయక్. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఆశ్రిత వినాయక్ మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. స్నేహ బంధం ప్రేమ బంధంగా మారడంతో... చివరకు వైవాహిక బంధం వైపు అడుగులు వేశారు.

వెంకీ కూతురు అత్తగారి ఫ్యామిలీ ఇదే
ఆశ్రిత అడుగు పెట్టబోయే కొత్త ఫ్యామిలీ ఇదే. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులను ఈ ఫోటోలో చూడొచ్చు.
హీరో వెంకటేష్ కూతురు వెడ్డింగ్.. (ఫొటోలు)

దగ్గుబాటి ఫ్యామిలీ
పెళ్లి వేడుక సందర్భంగా దగ్గుబాటి కుటుంబమంతా ఒకే ఫ్రేములోకి వచ్చారు. సురేష్ బాబు, వెంకటేష్, నాగ చైతన్య తల్లి లక్ష్మి, రానా, అభిరామ్, చైతు-సమంత దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు.

ఆశ్రిత దగ్గుబాటి
ఆశ్రిత ప్రొఫెషనల్ బేకర్, ఫుడ్ బ్లాగర్. పెళ్లి తర్వాత కూడా ఆమె దీన్ని కొనసాగిస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











