twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ చంకలో మహేష్ బాబు (చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రేంజిలో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. వివాద రహితుడైన మహేష్ బాబు మర్యాదగల వ్యక్తిగా, సాఫ్ట్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్కడు, మురారి, దూకుడు, పోకిరి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. చిన్నతనంలో 9 సినిమాల్లో బాల నటుడిగా రాణించిన మహేష్ బాబు...ఇప్పటి వరకు 17 సినిమాల్లో హీరోగా నటించారు.

    మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మొత్తం ఏడు నంది అవార్డులు అందుకున్నారు. అదే విధంగా బెస్ట్ తెలుగు యాక్టర్ గా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. దీంతో పాటు మూడు సినీ 'మా' అవార్డులు, ఒక సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు గెలుచుకున్నారు.

    సూపర్ స్టార్ కృష్ణ-ఇంద్రాదేవిల సంతనం అయిన మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చిన్నతనంలోనే నాన్నతో సినిమా షూటింగులకు వెళ్లడం అలవాటయిన మహేష్ బాబు నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. మహేష్ బాబుకు సోదరుడు రమేష్ బాబు(నటుడు, నిర్మాత)తో పాటు సోదరీమణులు పద్మావతి, మంజుల(యాక్టర్, ప్రొడ్యూసర్), ప్రియదర్శిణి ఉన్నారు.

    మహేష్ బాబుతో పాటు ఆయన కుటుంబం మొత్తం కుటుంబ, కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడి పేరు గౌతంకృష్ణ, కూతురు పేరు సితార. మహేష్ బాబుకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫోటోలపై ఓ లుక్కేయండి.

    మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    సోదరుడు రమేష్ బాబుతో కలిసి మహేష్ బాబు

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    వెంకీ చంకలో మహేష్ బాబు, 10 సంవత్సరాల వయసులోపు, టీనేజ్ ఫోటో, కొడుకు గౌతం కృష్ణతో కలిసి

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    సోదరుడు రమేష్ బాబుతో కలిసి చైల్డ్ ఆర్టిస్టుగా మహేష్ బాబు

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబులతో కలిసి మహేష్

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్‌కు హాజరైన మహేష్. చిత్రంలో ఆయన తండ్రి కృష్ణ, సోదరి మంజుల కూడా ఉన్నారు.

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    మహేష్ బాబు 9 సినిమాల్లో బాల నటుడిగా, 17 సినిమాల్లో హీరోగా నటించారు.

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ బాబు. చిత్రంలో ఆయన భార్య నమ్రత, సోదరి మంజుల, నటుడు సుమంత్ కూడా ఉన్నారు.

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    తనయుడు గౌతంతో కలిసి మహేష్ బాబు. మహేష్ బాబు పిల్లలతో గడపడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ చిత్రం చూసి అర్థం చేసుకోవచ్చు.

    వెంకీ చంకలో మహేష్ బాబు(చిన్ననాటి అరుదైన ఫోటోలు)

    తండ్రి కృష్ణతో కలిసి మహేష్ బాబు. తండ్రి పట్ల మహేష్ బాబు ఎంతో గౌరవంతో ఉంటారు.

    English summary
    Currently, the most wanted actor in Telugu industry - Mahesh Babu, is a very soft spoken, humble actor. He has acted in many successful movies such as Okkadu, Murari, Athadu, Dookudu, Pokiri and many more. He worked in nine films as child artist and 17 films as lead actor till date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X