తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్ : సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం తమిళనాట మాత్రమే పాపులర్ కాదు...టాలీవుడ్ టాప్ హీరోలతో సమానమైన క్రేజ్ ఆయన ఇక్కడ సంపాదించుకున్నారు. 1976లో 'అంతులేని కథ'(ఓ తమిళ చిత్రానికి అనువాదం) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రజనీకాంత్ ఆ తర్వాత దాదాపు తెలుగులో నేరుగా 15 చిత్రాల్లో నటించారు. ఇంకా అనేక డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.

రజనీకాంత్ తెలుగునాట బాగా బాపులర్ కావడానికి ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్, యాక్షన్, కామెడీ టైమింగే కారణం. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. అదే విధంగా తెలుగు స్టార్లతో కూడా రజనీకాంత్ మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తదితరులతో రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు వన్ ఇండియా తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ....తెలుగు స్టార్లతో ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం.

 తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, చంద్రబాబు, వెంకటేష్, రామ్ చరణ్ తో రజనీకాంత్

 తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

చిరంజీవి, శత్రుజ్ఞ సిన్హా, మోహన్ బాబులతో కలిసి కన్నడ నటుడు అంబరీష్ బర్త్ డే వేడుకలో పాల్గొన్న రజనీకాంత్

 తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

కృష్ణార్జున సినిమా సెట్లో...నాగార్జున, మోహన్ బాబు, విష్ణు, దర్శకుడు పి.వాసులతో కలిసి రజనీకాంత్

తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

చిరంజీవితో రజనీకాంత్

 తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

మోహన్ బాబుతో రజనీకాంత్

తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

వెంకటేష్ తో రజనీకాంత్

తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

బాలకృష్ణతో రజనీకాంత్

తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

మంచు లక్ష్మితో రజనీకాంత్

తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

మోహన్ బాబు, మంచు లక్ష్మితో రజనీకాంత్

తెలుగు టాప్ స్టార్లతో...రజనీకాంత్ (రేర్ ఫోటోస్)

రామ్ చరణ్-ఉపాసన పెళ్లి సందర్భంగా దంపతులను ఆశీర్వదిస్తున్న రజనీకాంత్

రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం ఆయన కొచ్చాడయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రం ద్వారా రజనీ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వంలో సౌందర్యకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె నటిస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X