పాకిస్థాన్ గర్ల్ ఫ్రెండ్‌తో సల్మాన్ ఖాన్ (రేర్ ఫోటోలు)
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. 50 ఏళ్లకు దగ్గరవుతున్నా ఇంకా బ్యాచిలర్‌గానే కొనసాగుతున్న ఈ కండల వీరుడికి ఆడ వాసనంటే పడదనుకుంటే పొరపాటే. వివాదాలతో పాటు సల్లూ భాయ్‌కి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. చాలా మంది స్టార్ హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు సాగించాడు. ఆ లిస్టులో ఐశ్వర్య రాయ్, కత్రినా లాంటి కత్తిలాంటి ఫిగర్లు ఉన్నారు.
సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ లిస్టులో దేశీ భామలే కాదు...విదేశీ పాపలు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పకోదగ్గ భామ పాకిస్థాన్‌కు చెందిన సోమీ అలీ. 1990 తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోమీ అలీ ఎక్కువ కాలం ఇక్కడ నిలదొక్కుకోలేక పోయింది. అయితే సల్మాన్‌తో ఎఫైర్ నడిపి బాగా పాపులరిటీ సంపాదించింది. చాలా కాలం పాటు ఇద్దరి మధ్య వ్యవహారం నడించింది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ 1999లో ఇద్దరూ విడిపోయారు.
చాలా కాలం తర్వాత బయట పడ్డ విషయం ఏమిటంటే...వీరిద్దరి మధ్య బ్రేకప్ రావడానికి కారణం సల్లూ ఐశ్వర్యరాయ్ వ్యామోహంలో చిక్కుకోవడమేనట. ఇటీవల ఓ ఇంట్వర్యూలో సోమీ అలీ ఈ విషయాన్ని బయట పెట్టింది. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సోనీ అలీ సల్మాన్‌పై మనసు పారేసుకుందట. తను భారత్ రావడానికి బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కారణంతో పాటు, సల్మాన్‌పై మోజు కూడా కారణమని చెప్పింది.
తన మాజీ గర్ల్ ఫ్రెండ్ సోమీ అలీతో కలిసి సల్మాన్ అరుదైన ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

సల్మాన్ ఖాన్-సోమీ అలీ రేర్ ఫోటో

సల్మాన్ తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని సోమీ అలీ చెప్పింది

సల్మాన్-సోమీ అలీ గ్రేట్ లుకింగ్ జంటగా అప్పట్లో పేరు తెచ్చుకున్నారు

1999లో సల్మాన్, సోమీ అలీ విడిపోయారు

సల్మాన్ తో బ్రేకప్ తర్వాత సోమీ అలీ విదేశాలకు వెళ్లి పోయింది.

సోమీ అలీ, సల్మాన్ ఖాన్ ఇప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు


Click it and Unblock the Notifications











