షారుక్ ఖాన్... అరుదైన ఫోటోలు
ముంబై: బాలీవుడ్‌లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ స్టార్లలో షారుక్ ఖాన్ ఒకరు. ఒకప్పుడు వరుస హిట్లతో బాలీవుడ్ బాద్‌షాగా పేరు తెచ్చుకున్న షారుక్, ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నాడు. షారుక్ సినిమాల్లోకి రాక ముందు పలు టీవీ సీరియళ్లలో నటించాడు. 1992లో వచ్చిన 'దీవానా' చిత్రం షారుక్ బాలీవుడ్ తెరంగ్రేటం చేసారు. ఈచిత్రంలో దివ్య భారతి హీరోయిన్.
షారుక్ తన కెరీర్లో ఎన్నో నెగెటివ్ క్యారెక్టర్లు చేసాడు. దార్ అండ్ అంజామ్ చిత్రాల్లో సైకో లవర్ గా నటించాడు. బాజీగర్ చిత్రంలో కూడా షారుక్ పోషించింది నెగెటివ్ రోలే. కానీ 'దిల్ వాలె దుల్హనియా లే జాయేంగే', 'దిల్ తో పాగల్ హై', 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రాలు ఆయనకు కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేరు తెచ్చాయి.
షారుఖ్ 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే అతని తండ్రి క్యాన్సర్ వ్యాధితో మరణించారు. తల్లి 1990లో అనారోగ్యంతో మరణించింది. షారుక్ తన తల్లిదండ్రుల వద్ద చిన్న నాటి నుంచి ఎంతో గారంగా పెరిగాడు. తన చిన్న వయసులోనే వారి మరణం అతన్ని ఎంతో బాధించడంతో హార్డ్ వర్క్ చేసేలా చేసింది.
షారుక్ ఖాన్‌కు సంబంధించిన అరుదైన ఫోటోలు....

అమీర్ ఖాన్‌తో షారుక్ ఖాన్ అరుదైన ఫోటో

షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు గుల్షన్ గోవర్

మాధురి దీక్షిత్‌తో షారుక్ ఖాన్

దివ్య భారతితో షారుక్ ఖాన్

కరిష్మా కపూర్‌తో షారుక్ ఖాన్

రణబీర్ కపూర్, మాధురి దీక్షిత్‌తో షారుక్

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతాతో షారుక్

సుస్మితా సేన్ తో షారుక్

జుహీ చావ్లాతో షారుక్

కరణ్ జోహార్‌తో షారుక్

అభిమానులతో షారుక్

భార్య గౌరీతో షారుక్

స్నేహితులతో షారుక్ యుక్త వయసు ఫోటో

గౌరీ, షారుక్ ఓల్డ్ పిక్చర్

తండ్రి, సోదరితో కలిసి బేబీ షారుక్


Click it and Unblock the Notifications











