షారుక్ ఖాన్ వెనక ఆమె...(రేర్ ఫోటోస్)
ముంబై: ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అని చెబుతుంటారు. ఈ మాట బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు వందశాతం సూటవుతుంది. షారుక్ కూడా చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు.
గౌరీ విషయానికొస్తే... ఆమె కేవలం షారుక్ ఖాన్ భార్యగానే కాకుండా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో గౌరీ, షారుక్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో పాటు, రెడ్ చిల్లీస్ ఎంటర్‍టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నెలకొల్పారు. అప్పటి నుంచి గౌరీ ఖాన్ నిర్మాతగా కొనసాగుతున్నారు. నిర్మాతగా ఆమె తొలి సినిమా ఫరాఖాన్ దర్శకత్వంలో వచ్చిన 'మై హూనా'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.
1990ల్లో ఆమె ఓ మ్యూజిక్ ఛానల్లో హిందీ మ్యూజిక్ కౌంట్ డౌన్ షో 'ఓయె'ను కూడా నిర్వహించారు. 2010లో హృతిక్ భార్య సుసానె రోషన్ భాగస్వామ్యంతో సొంతంగా ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ మాట్లాడుతూ...'నేను చేసే ప్రతి పనికి ప్రేరణ షారుక్. నేను ఇంటీరియల్ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు షారుక్ ఎంతో హాపీగా ఫీలవడంతో పాటు నన్ను ప్రోత్సహించారు' అని చెప్పుకొచ్చారు.
ఇలా ఎంతో అన్యోన్యంగా, ప్రేమ పూరితంగా, రొమాంటిక్‌గా, ఒకరి అభిరుచులకు, అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఆదర్శవంతమైన దాంపత్య జీవితం గడుపుతున్నారు షారుక్-గౌరీ. ఈ ఇద్దరికీ సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి.

యవ్వనంలో గౌరీ ఖాన్

షారుక్ తో గౌరీ

షారుక్, గౌరీ పాత చిత్రం

గౌరీ ఖాన్ రేర్ ఫోటో

సుసానెతో గౌరీ ఖాన్

కుటుంబ సభ్యులతో షారుక్, గౌరీ అరుదైన ఫోటో

భర్త, పిల్లలతో గౌరీ

ఫరా ఖాన్‌తో గౌరీ

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో గౌరీ-షారుక్

గౌరీ ఖాన్ పాత చిత్రం

బాలీవుడ్ బ్యూటీలతో గౌరీ

గౌరీ, షారుక్, కరణ్

షారుక్, గౌరీ

వోగ్ కవర్ పేజీపై గౌరీ

జీ క్యూ అవార్డుల కార్యక్రమంలో షారుక్, గౌరీ

గౌరీ ఖాన్ రేర్ ఫోటో

ఫోటో షూట్ కార్యక్రమంలో గౌరీ, షారుక్

కూతురు సుహానాతో గౌరీ

స్టన్నింగ్ రెడ్ డ్రెస్ లో గౌరీ

గౌరీ, షారుక్


Click it and Unblock the Notifications











