twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతీయ సినీ పరిశ్రమలో బాగా పాపులారిటీ సంపాదించిన టాప్ హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం, కన్నడ చిత్రాల్లో శ్రీదేవి తనదైన ముద్ర వేసింది.

    1967లో వచ్చిన 'కందన్ కరుణై' అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా తెరంగ్రేటం చేసిన శ్రీదేవి 'మూండ్రు ముడిచ్చు' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. ఆమె తెలుగులో హీరోయిన్ నటించిన తొలి చిత్రం 1977లో వచ్చిన 'బంగారక్క'. 'పదహారేళ్ళ వయసు' చిత్రం ద్వారా శ్రీదేవి తొలిభారీ విజయాన్ని చవి చూసింది. ఆతర్వాత ఆమెకు హీరోయిన్ గా తిరుగు లేకుండా పోయింది.

    బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్‌తో వివాహం తర్వాత శ్రీదేవి పూర్తిగా సినిమాలకు దూరం అయింది. తన కుమార్తెలు ఝాన్వి, ఖుషిల ఆలనా పాలనకే శ్రీదేవి పూర్తి సమయాన్ని కేటాయించింది. చాలా కాలం తర్వాత శ్రీదేవి 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి తనలో గ్లామర్, నటించే సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించింది.

    శ్రీదేవికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుంటూ... ఆమెకు సంబంధించిన రేర్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    అయ్యప్పన్, రాజేశ్వరి దంపతులకు శ్రీదేవి ఆగస్టు 13, 1963లో తమిళనాడులోని శివకాసిలో జన్మించింది.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ టాలెంటెడ్... గ్లామరస్ హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    శ్రీదేవి 4 ఏళ్ల వయసులోనే నటన ప్రారంభించింది. 1967లో వచ్చిన ‘కందన్ కరుణై' అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా తెరంగ్రేటం చేసింది.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    1971లో వచ్చిన ‘పుంబాట్ట' అనే మళయాల చిత్రంలో అద్భుత నటన కనబర్చిన శ్రీదేవి కేరళ ప్రభుత్వంచే ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    భారతీయ సినీ పరిశ్రమలోని ఎక్కువ మంది ప్రముఖ హీరోలతో కలిసి నటించిన హీరోయిన్లలో శ్రీదేవిది అగ్రస్థానం.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    1975లో జూలీ అనే చిత్రంలో బాల నటిగా హిందీ చిత్ర సీమలో అడుగు పెట్టింది. ఇందులో శ్రీదేవి నటి లక్ష్మికి సోదరి పాత్రలో నటించింది.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    శ్రీదేవికి తెలుగులో తొలి హిట్ సినిమా ‘పదహారేళ్ల వయసు'. ఆతర్వాత ఆమె తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించారు.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    కమల్ హాసన్ తరువాత... శ్రీదేవి తెలుగు హీరో కృష్ణతో ఎక్కువ చిత్రాలలో నటించారు.

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    మాజీ ప్రధాని వాజ్ పేయ్, ఐశ్వర్యరాయ్ తో శ్రీదేవి

    అతిలోక సుందరి.. శ్రీదేవి (రేర్ ఫోటోస్)

    లక్స్ సబ్బు యాడ్ చిత్రీకరణలో.... షారుక్, హేమామాలిని, జుహీ చావ్లా, కరీనా కపూర్లతో కలిసి శ్రీదేవి.

    English summary
    Sridevi Kapoor, one of the most brilliant actresses of all times is often cited as "The First Female Superstar of the Indian Cinema." The girl who began acting at a tender age of four went on to act in Tamil, Telugu, Hindi, Malayalam and Kannada films. Check out rare and unseen pictures of Sridevi by clicking on the slider.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X