»   » విద్యా బాలన్: చిన్నప్పుడు క్యూట్, ఇప్పుడు సెక్సీగా(ఫోటోలు)

విద్యా బాలన్: చిన్నప్పుడు క్యూట్, ఇప్పుడు సెక్సీగా(ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: ఇంత కాలం వెండితెరపై తన అందచందాలు, పెర్ఫార్మెన్స్ తో ఓ ఊపు ఊపిన విద్యా బాలన్ ఎట్టకేలకు ఓ ఇంటిదైంది. యుటివి అధినేత సిద్ధార్థ రాయ్ కపూర్‍‌ను ప్రేమించి పెళ్లాడింది. బాంద్రాలోని గ్రీన్ మిల్ బంగ్లాలో వీరి వివాహం సాదాసీదాగా జరిగింది. ఈ వివాహ వేడుక సౌతిండియన్ మరియు పంజాబీ సంప్రదాయ మేళవింపుతో జరిగిందనే ప్రచారం జరుగుతోంది.

  విద్యా బాలన్ తన బెస్ట్ ఫ్రెండ్ సాబియా సాచి ముఖర్జీ డిజైన్ చేసిన సిల్క్ సారీ ధరించగా, సిద్ధార్థరాయ్ కపూర్ పసుపురంగు కుర్తా ధరించారు. విద్యా బాలన్-సిద్ధార్థ రాయ్ కపూర్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ ఎఫైర్ బయట పడింది. విషయం లీక్ కావడంతో తమ బంధం గురించి బయటి ప్రపంచానికి అఫీషియల్ గా తెలియజేసారు. తాజాగా పెద్దల అంగీకారంతో ఓ ఇంటివారయ్యారు.

  విద్యా బాలన్ సినిమాల విషయానికొస్తే... డర్టీ పిక్చర్ సినిమా ద్వారా సెక్సీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విద్యా బాలన్ ఇమ్రాన్ హస్మి హీరోగా రూపొందుతున్న 'ఘన్ చక్కర్' చిత్రంలో నటిస్తోంది. దీనికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా ఆమె భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది. పెళ్లికి ముందు ఈ రెండు చిత్రాలకు విద్యా బాలన్ కమిట్ అయింది.

  విద్యా బాలన్ చిన్ననాటి ఫోటో

  విద్యా బాలన్ 1978 జనవరి 1న కేరళలో జన్మించింది. ఆమె ఇంట్లో తమిళం-మళయాలం మిక్స్ చేసి మాట్లాడుతుంది. అదే విధంగా హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, బెంగాళీ అనర్గలంగా మాట్లాడగలదు.

  డిసెంబర్ 14, 2012న విద్యా బాలన్ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థరాయ్ కపూర్ ను పెళ్లాడింది.

  విద్యా బాలన్ తన పర్సనల్ లైఫ్ విషయాలను మీడియాకు దూరంగా ఉంచేది. సిద్ధార్థరాయ్ కపూర్ తో దాదాపు 2 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నా విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది.

  డిసెంబర్ 11న సంగీత్ కార్యక్రమంతో విద్యా బాలన్ పెళ్లి వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

  విద్యా బాలన్ వివాహ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుందాం...

  English summary
  Actress Vidya Balan finally got married to her boyfriend UTV head Siddharth Roy Kapur. Their wedding that took place at the Green Mile bungalow in Bandra, was a low profile affair. The wedding ceremonies took about an hour and is rumoured to have been a mix of South Indian and Punjabi styles. we are here to treat you all with a few rare and unseen pictures of the actress. Have a look...
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more