ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి పోగా వచ్చిన లాభంలో సగ భాగాన్ని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు, విద్యార్థుల ఆధ్వర్యంలో నడిపే తెలంగాణ ఉద్యమానికి కేటాయిస్తా అంటున్నారు రసమయి బాలకిషన్. ఆయన స్వీయ దర్శకత్వంలో రసమయి ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జై తెలంగాణ'. వీరులకు మరణం లేదు అనేది ట్యాగ్‌లైన్ తో రూపొందిన ఈ చిత్రం ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే తెలంగాణపై తీసిన సినిమాలను తెలంగాణా ప్రజలే చూడరన్న అపవాదును తొలగించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉంది. కావున ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని వేడుకుంటున్నా అని ఆయన అన్నారు. ఇందులో నేను చిత్ర గుప్తుడి పాత్రలో నటించా. ఇందులో హీరో హీరోయిన్లు ఉండరు. తెరాస ఆధ్యక్షుడు కేసీఆర్ ఈ చిత్రాన్ని దేవీ థియేటర్‌లో చూసి... సినిమా బాగా తీశావని అభినందించారు. విడుదలైన అన్ని చోట్లా ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు అన్నారు.