సినిమాతో వ్యాపారం చెయ్యటం లేదు
"తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మాది వ్యాపారం కాదు. వందలాది థియేటర్లలోనూ సినిమాను విడుదల చేయలేదు. అందుకే ప్రస్తుతం ప్రదర్శిస్తున్న థియేటర్లు మరో వారం రోజులు మా చిత్రాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను'' అని రసమయి బాలకిషన్ అన్నారు. ఆయన దర్శకనిర్మాతగా వ్యవహరించిన 'జై తెలంగాణ' ఇటీవలే విడుదలైంది. మంగళవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో బాలకిషన్ పైవిధంగా స్పందించారు. అలాగే "మా 'జై తెలంగాణ'కు మంచి స్పందన వస్తోంది. తొలివారం థియేటర్ల యాజమాన్యం పర్సెంటేజీ విధానానికి ఆడుతున్నారు. రెండో వారం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరుతున్నాం. మా చిత్రాన్ని తెలంగాణలో మాత్రమే విడుదల చేశాం. ప్రస్తుతం ప్రదర్శిస్తున్న థియేటర్లు మరో వారం పాటు మా చిత్రాన్నే కొనసాగిస్తే ఎక్కువ మంది చూసే అవకాశం కలుగుతుంది.
ఇందులో నేను చిత్ర గుప్తుడి పాత్రలో నటించా. ఇందులో హీరో హీరోయిన్లు ఉండరు. తెరాస ఆధ్యక్షుడు కేసీఆర్ ఈ చిత్రాన్ని దేవీ థియేటర్‌లో చూసి... సినిమా బాగా తీశావని అభినందించారు. విడుదలైన అన్ని చోట్లా ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు అన్నారు'' అని అన్నారు.ఇక ఇందులో మరో ప్రధాన పాత్ర చేసిన రోషం బాలూ మాట్లాడుతూ..."నేను నటించిన వీరన్న పాత్రకు మంచి స్పందన వస్తోంది. మా సినిమాలకు తొలి వారమే ఓపెనింగ్స్ రావు. ఓ వారం దాటితే మౌత్ పబ్లిసిటీతో సినిమా నిలుస్తుంది'' అన్నాడు.


Click it and Unblock the Notifications












