అబ్బాయి లవ్ లెటర్ రాస్తే మా అమ్మకే ఇచ్చా.. అది స్టుపిడ్.. ఆ రూమర్ తో రాశి షాక్!
Recommended Video

చిత్ర పరిశ్రమలో పుకార్ల బెడద ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవి శృతి మించిన సమయంలో సదరు సెలెబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి సమస్యలే క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నాకు కూడా ఎదురయ్యాయి. రాశి ఖన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి గురించి కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటి గురించి రాశి ఖన్నా ఘాటుగానే స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని అనిల్ తనకు మంచి స్నేహితుడని తేల్చేసింది.

సుప్రీం చిత్రంలో
సాయిధరమ్ తేజ్ నటించిన సూపర్ హిట్ చిత్రం సుప్రీంలో రాశి ఖన్నా హీరోయిన్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. సుప్రీంలో అనిల్ రావిపూడి.. తేజు, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా ఆవిష్కరించారు.

బెంగాల్ టైగర్ లో రాశి అదుర్స్
రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రంలో కూడా రాశి నటించింది. ఆ చిత్రంలో రాశి గ్లామర్ షో యువతని ఆకట్టుకుంది.

స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు
ఇటీవల అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం రాజా ది గ్రేట్. రవితేజ అంధుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ఫ్రీగా చేసిందంటూ వార్తలు
రాజా ది గ్రేట్ చిత్రంలో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ ని ఉచితంగా చేసిందంటూ వార్తలు వచ్చాయి. దీని గురించి సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకుని వచ్చాయి.

పుకార్ల వెల్లువ
రాశి ఖన్నా, అనిల్ రావిపూడి మధ్య ఏదో జరుగుతోదంటూ పుకార్లు మొదలయ్యాయి. అందువల్లనే రాశి రాజా ది గ్రేట్ చిత్రంలో ఫ్రీగా స్పెషల్ సాంగ్ చేసిందనేది ఆ పుకార్ల సారాంశం.

రాశి ఖన్నా రియాక్షన్
వెల్లువలా వస్తున్న పుకార్ల గురించి రాశి ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఈ వార్తల గురించి స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేసింది. అది స్టుపిడ్ రూమర్ అని ఫైర్ అయింది.

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు
తాను అనిల్ రవి పూడి దర్శకత్వంలో సుప్రీం చిత్రంలో నటించానని రాశి తెలిపింది. దర్శకుడు అనిల్ రవి పూడి నాకు మంచి స్నేహితుడు. రవితేజ కూడా తనకు స్నేహితుడని అందువల్లనే స్పెషల్ సాంగ్ చేసినట్లు రాశి క్లారిటీ ఇచ్చింది.

నిజంగానే ఉంటే ఓకె
మా ఇద్దరో మధ్య నిజంగా ఏదో జరుగుతుంటే ఇలాంటి వార్తలు రాసినా పరవాలేదు. కానీ ఇలా అవాస్తవాలు ఎలా రాస్తారు అంటూ రాశి ఖన్నా మండి పడింది.

నేను కూడా ఓ తల్లికి బిడ్డనే
తాను కూడా ఓ తల్లికి బిడ్డనే అని రాశి ఖాన్నా ఎమోషనల్ అయింది. ఇలాంటి వార్తలు రాస్తే అమ్మాయిగా తనకు కూడా బాధ ఉంటుందని రాశి ఇంటర్వ్యూలో తెలిపింది.

అబ్బాయి రాసిన లవ్ లెటర్ ని అమ్మకే ఇచ్చా
తన జీవితంలో ఎలాంటి ప్రేమ కథలు లేవని రాశి ఖాన్నా తేల్చి చెప్పింది. తాను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదని రాశి వెల్లడించింది. కానీ కాలేజీ రోజుల్లో సీనియర్ అబ్బాయి ఒకరు తనకు ప్రేమలేఖ రాశాడని, ఆ లెటర్ ని నేరుగా తీసుకుని మా అమ్మకే చూపించానని రాశి తెలపడం విశేషం.


Click it and Unblock the Notifications











