నా క్యారెక్టర్ అదే.. అసలు విషయం బయటపెట్టిన రాశి ఖన్నా
ఇటీవలే శ్రీనివాస కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాశి ఖన్నా.. ప్రస్తుతం వెంకీమామ సెట్స్ పై చురుకుగా కదులుతోంది. ఈ సినిమా కోసం రాశి ఖన్నా సన్నబడిందని, పైగా ఈ చిత్రంలో రాశి పోస్తిస్తున్న రోల్ చాలా డిఫరెంట్ అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రాశీ ఖన్నా.. వెంకీమామ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయమై స్పందించింది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న వెంకీమామ సినిమాలో తాను ఫిలింమేకర్ పాత్ర పోషిస్తున్నాని చెప్పింది. ఈ రోల్ లో తాను చాలా కూల్‌గా, మోడ్రన్ లుక్‌లో కనిపిస్తానని తెలిపింది. తన లుక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని, మునుపెన్నడూ చూడని ఈ లుక్ చూసి ప్రేక్షకలోకం సర్‌ప్రైజ్ కావడం ఖాయం అని చెప్పుకొచ్చింది రాశి ఖన్నా.

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ సినిమాలో రీల్ లైఫ్ మామ అల్లుళ్లుగా కనిపించనున్నారు. 'వెంకీ మామ'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











