twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత మంది హీరోయిన్ల వెంట పడతావు నితిన్..మెగా హీరో హీరోయిన్ తో..!

    |

    నితిన్ కు లవర్ బాయ్ వేషాలు బాగా కలసి వస్తున్నాయి. ఈ హీరో ప్రేమ కథలతో ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. కానీ యాక్షన్ చిత్రాలు మాత్రం నితిన్ కు కలసి రాలేదు. ఛల్ మోహన్ రంగ పేరుతో నితిన్ మరో లవ్ ఎంటర్ టైనర్ తో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక నితిన్ శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్ర విషయంలో నితిన్ కు హీరోయిన్ సమస్యలు మొదలయ్యాయి. నితిన్ హీరోయిన్ల విషయంలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

     నితిన్ తో రెండవ సారి స్టార్ ప్రొడ్యూసర్

    నితిన్ తో రెండవ సారి స్టార్ ప్రొడ్యూసర్

    సతీష్, నితిన్ చిత్రం ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్, దిల్ రాజు నిర్మాణములో నటించబోతున్న చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో దిల్ చిత్రం వచ్చింది.

    Recommended Video

    Chal Mohan Ranga First Look
     రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా

    రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా

    దర్శకుడు సతీష్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. శతమానం భవతి చిత్రం ఘన విజయం సాధించింది. దీనితో నితిన్ చిత్రంపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు మొదలయ్యాయి.

     హీరోయిన్ల వేట

    హీరోయిన్ల వేట

    దర్శకుడు సతీష్ ఈ చిత్రంలో నితిన్ కు సరైన జోడి కోసం వేట మొదలు పెట్టారు. పలువురు హీరోల పేర్లు ఈ చిత్రం కోసం వినిపిస్తున్నాయి. మొదట నందిత శ్వేతా ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా నటించబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత రష్మిక మందన పేరు కూడా వినిపించింది. లేటెస్ట్ గా రాశి ఖన్నా పేరు వినిపించడంతో ఆసక్తిగా మారింది.

     తొలిప్రేమ ఎఫెక్ట్

    తొలిప్రేమ ఎఫెక్ట్

    వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం 2018 లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో అందరి దృష్టి రాశి ఖన్నాపై పడింది.

     నితిన్ కు ఇద్దరు భామలా

    నితిన్ కు ఇద్దరు భామలా

    వరుసగా నితిన్ సినిమా కోసం హీరోయిన్ల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకావం ఉందని కూడా సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ ఇంత వరకు ఏ హీరోయిన్ ని కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.

    English summary
    Rashi Khanna to romance with Nithin. Latest news is that Rashi Khanna selected as fema lead in Nithiin and Satish Vegesna movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X