అనసూయ, రష్మీ.. ఇద్దరిలో ఎవరిది పైచేయో పది రోజుల్లో తేలిపోనుంది

ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో సుమ తర్వాతి స్థానంలో కొనసాగుతున్న అనసూయ, రష్మీ గౌతమ్. ఇద్దరూ తమ తమ లక్ష్యాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, ఫేమస్ కామెడీ షో 'జబర్దస్త్'లో అవకాశం దక్కించుకున్నప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవడం లేదు. ఈ షో తలో ఎపిసోడ్‌ను పంచుకున్న ఈ భామలిద్దరూ అభిమానులను కూడా అదే స్థాయిలో సంపాదించుకున్నారు. కొంత మంది అనసూయ గ్రేట్ అంటే.. మరికొంత మంది రష్మీ సూపర్ అంటారు. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పలేము. కానీ, త్వరలోనే ఎవరిది పైచేయి అనేది మాత్రం చెప్పవచ్చు.

 రష్మీ భయపెడతానంటుంది

రష్మీ భయపెడతానంటుంది

రష్మీ, నందు, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి ప్రధాన పాత్రధారులుగా, నల్లా స్వామి సమర్పణలో, యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, ఎ.పద్మనాభ రెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు నిర్మిస్తున్న సినిమా ‘శివరంజని'. హారర్ కమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి నాగ ప్రభాకర్ దర్శకుడు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది కొంచెం భయంకరంగానే ఉండడంతో చిత్ర యూనిట్ దీనిపై ఆశలు పెట్టుకుంది.

ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు

ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు

‘శివరంజని'ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసేసింది. హర్రర్ జోనర్ కావడంతో దీంతో రష్మీ అభిమానులు ఈ సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాపై ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అనసూయ ‘కథనం’

అనసూయ ‘కథనం’

అనసూయ తాజా చిత్రం ‘కథనం'. ఇందులో ఆమె రైటర్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఆమె రాసిన క‌థ బ‌య‌ట జ‌రుగుతుంది. అక్క‌డ గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ రాసిన క‌థే బ‌య‌ట కూడా జ‌రుగుతుంటుంది. ఇక్క‌డ కూడా క‌థ‌లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంద‌ని రాస్తే.. బ‌య‌ట కూడా జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ క‌థ‌నం క‌థ అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు రాజేష్ నాదెండ్ల‌.

ఆగస్టు 9న విడుదల

ఆగస్టు 9న విడుదల

అనసూయ లీడ్ రోల్ చేసిన ‘కథనం' ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందునా.. అనసూయ ఇందులో ఏకంగా ఫైటింగ్స్ కూడా చేస్తుంది. చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంది. అందుకే నాగార్జున ‘మన్మథుడు 2' రిలీజ్ అవుతున్న రోజునే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఎవరికి హిట్ వస్తుంది

ఎవరికి హిట్ వస్తుంది

బుల్లితెరపై రాణుల్లా వెలుగొందుతున్న ఇద్దరు యాంకర్లు వారం రోజుల వ్యవధిలో తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరిలో ఎవరి సినిమా హిట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరిది హిట్ అయితే వాళ్లది పైచేయి అన్నట్లు ఈ యాంకర్ల అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X