»   »  యాంకర్ రష్మి బర్త్ డే స్పెషల్ ('చారుశీల' హాట్ ఫోటోస్)

యాంకర్ రష్మి బర్త్ డే స్పెషల్ ('చారుశీల' హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన యాంకర్ రేష్మి....'గుంటూరు టాకీస్' చిత్రంలో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోడయం ద్వారా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం 'అంతం' అనే సినిమాతో పాటు 'చారుశీల' అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

'గుంటూరు టాకీస్' మూవీలో గ్లామరస్ లుక్ లో మాత్రమే చూసాం. అయితే ఆ సినిమాలో ఆమెకు నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. అయితే ఆమె తాజా చిత్రం 'చారుశీల'లో మాత్రం రేష్మికి యాక్టింగ్ పరంగా తన టాలెంటును ఓ రేంజిలో చూపించే అవకాశం దక్కింది.

వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య తారాగణం.

దర్శకుడు శ్రీనివాస్ వుయ్యూరు మాట్లాడుతూ.. "థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ గా 100 సినిమాలు పూర్తయిన తర్వాత చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్ గారికి లైన్ చెప్పగా, మనమే ప్రొడ్యూస్ చేద్దామన్నారు. వీల్ చైర్ లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల నటిస్తాడా? లేదా? అని భయపడ్డాను, ఒప్పుకున్నాడు. అద్బుతంగా నటించాడు, రాజీవ్ కనకాల, రేష్మిలకు అవార్డులు వస్తాయి. మా అబ్బాయి ఓ క్యారెక్టర్ చేశాడు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం" అని అన్నారు.

బుధవారం(ఏప్రిల్ 27) రష్మి పుట్టినరోజు సందర్బంగా చారుశీల చిత్రానికి సంబంధించిన కొత్త ఫోటోలు రిలీజ్ చేసారు. స్లైడ్ షోలో...

చారుశీల

చారుశీల

'చారుశీల'లో రేష్మి గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది.

దర్శకుడు

దర్శకుడు

వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చారుశీల'.

తారాగణం

తారాగణం

బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్, బెనర్జీ, మెల్కోటే, రాకెట్ రాఘవ, గెటప్ శీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి మాటలు : కుమార్ మల్లారపు, ఎడిటింగ్ : వి.నాగిరెడ్డి, సంగీతం : సుమన్ జూపూడి, ఆర్ట్ : బాబ్జీ, నిర్మాతలు : వి.సాగర్ & శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ - స్క్రీన్ ప్లే - సినిమాటోగ్రఫీ - దర్శకత్వం :శ్రీనివాస్ రెడ్డి వుయ్యూరు

English summary
Check out Rashmi birthday special Charuseela stills.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu