»   » బర్త్ డే స్పెషల్: యాంకర్ రేష్మీ ‘అంతం’ (న్యూ ఫోటోస్)

బర్త్ డే స్పెషల్: యాంకర్ రేష్మీ ‘అంతం’ (న్యూ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'అంతం'. జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాను రామ్ గోపాల్ వర్మ వీరాభిమానిని..అందుకే ఆయన తీసిన 'అంతం' చిత్రం టైటిల్ నే మా సినిమాకు పెట్టుకున్నాము, ఆ సినిమా తరహాలోనే ఈ చిత్రానికి సైతం చాలా మంచి క్రేజ్ తీసుకొస్తుందన్నారు దర్శకుడు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. బుధవారం ఈ చిత్ర హీరోయిన్ రష్మి పుట్టినరోజు సందర్భంగా 'అంతం' చిత్రం కొత్త ఫోటోస్ రిలీజ్ చేసారు. వేసవి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది.

ఈ చిత్రం ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఎ సర్టిఫికెట్ పొందింది. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాధ్యతలు కూడా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి కళ్యాణే చేపట్టడం విశేషం.

స్లైడ్ షోలో 'అంతం' చిత్రానికి సంబంధించిన కొత్త ఫోటోస్...

అంతం

అంతం

రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అంతం'.

కళ్యాణ్

కళ్యాణ్

జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది.

నటీనటులు

నటీనటులు

రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం

ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ - రామ్ సుంకర
సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు

English summary
Actress Rashmi Gautam upcomming film "ANTHAM" Birthday pics released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu