For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ రికార్డ్ బ్రేకయ్యింది.... రేష్మీ హవా నడుస్తోంది

  |

  'రేసుగుర్రం' చిత్ర విజయానికి అనుకూలించిన అంశాల్లో పాటలు ఓ ఎత్తు, తరువాత కామెడీ మరో ఎత్తు... ఆ పాటల్లో 'సినిమా చూపిస్త మామా...' సాంగ్ అన్నిటికన్నా మిన్నగా మార్కులు సంపాదించింది... ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర కావొస్తోంది... అయినా ఇందులోని 'సినిమా చూపిస్త మామా...' పాటపై జనం మనసు పారేసుకుంటున్నారు... ఆ తీరున ఇప్పటికి ఈ పాటను కోటి మందికి పైగా వీక్షించారు... యూ ట్యూబ్ లో ఈ పాట ఇప్పటికే కోటికి మించి హిట్స్ రాబట్టింది... ఇక ముందు కూడా ఆ పాట జనాన్ని ఆకర్షిస్తూ సాగుతుందని చెప్పొచ్చు... మరి ఇంకెంతమందిని ఈ పాట ఆకట్టుకుంటుందో...

  మన తెలుగు పాటల్లో ఇప్పటి వరకు యూ ట్యూబ్ లో ఏ పాటకూ లభించనన్ని హిట్స్ ను బన్నీ 'రేసుగుర్రం' సాంగ్ కొట్టేసింది... అది ఓ రికార్డే!... అయితే దక్షిణాది పాటల్లో మాత్రం '3' సినిమాలోని "వై దిస్ కొలవరి కొలవరి ఢీ..." సాంగ్ నంబర్ వన్ గా నిలచి ఉంది... ఈ పాటకు ఒక కోటి యాభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల హిట్స్ దక్కాయి... ప్రస్తుతం తెలుగులో 'రేసుగుర్రం' లోని 'సినిమా చూపిస్త మామా...' సాంగ్ టాపు రేపుతోంటే, తమిళంలో మాత్రం 'వై దిస్ కొలవరి...' దుమ్ము రేపుతోంది... అయితే ఇవ్వన్నీ నిన్నటి మాటలు. ఇప్పుడు ఈ రెండు రికర్డులూ దబేల్మంటూ కింద పడ్డాయి. ఈ రెండుపాటల రికార్డూ బద్దలైపోయింది. అయితే ఈ రీఅర్డు బద్దలుకొట్టింది ఏ స్టార్ హీరో పాటనో, మరే జాతీయ అవార్డు సంగీత దర్శకుడో కాదు.. "మన జబర్దస్త్" రష్మి.

  ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు రికార్డులు వాటంతట అవే బద్దలవుతాయని రష్మీ నిరూపించిందని చెప్పవచ్చు. ఏదైనా సినిమా విడుదల అయ్యాక దానికి సంబందించిన కలెక్షన్లు, ఆడిన రోజులతో పాటు యూట్యూబ్‌లో దానికి సంబంధించిన ట్రైలర్స్, పాటలు క్రాస్ చేసిన వ్యూస్‌ని కూడా తప్పనిసరిగా లెక్కగడుతున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ యూట్యూబ్ లెక్కలోకి వెళ్లితేఅల్లు అర్జున్,సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం చిత్రంలోని ఊరమాస్ పాట 'సినిమా చూపిస్త మావ' కు ఇప్పటి వరకు 19,337,012 వ్యూస్ లభించాయి.

  rashmi gautam breaks the record of bunny

  ఇప్పుడు ఈ రికార్డ్ ని బుల్లితెర భామ బీట్ చేసింది. బుల్లితెర నుండి వెండి తెరపైకి వచ్చిన రేష్మి ఈ మధ్య గుంటూర్ టాకీస్ చిత్రంతో అభిమానులను అలరించింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే ఈ చిత్రంలోని మాస్ మసాలా సాంగ్ 'నీ సొంతం' అనే పాట యూ ట్యూబ్ లో ఇప్పటికే 20,308,639 వ్యూస్ సాధించి బన్నీ రికార్డ్ ని బ్రేక్ చేసింది. తక్కువ టైంలో రేష్మి సాధించిన ఈ రికార్డును చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

  ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సంవత్సరంలో వచ్చిన 'గుంటూరు టాకీస్' చిత్రం మంచి విజయాన్నే సాధించింది.ముఖ్యంగా ఈ సినిమాలో రష్మీతో చిత్రీకరించిన మాస్ మసాలా సాంగ్ అయిన 'నీ సొంతం' అనే పాట మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. దాంతో ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 2 కోట్ల 3 లక్షల వ్యూస్‌ని సాధించేసి బన్నీని దాటి ముందు వరుసలో నిలబడింది. పైగా బన్నీ పాట రెండేళ్లలో సాదించిన వ్యూస్‌ని రష్మీ పాట కేవలం ఏడాదిలోపే దక్కించుకోవడం మరో విశేషం. ఏది ఏమైనా మరే హీరో క్రాస్ చేయలేని బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో యూత్‌లో హీట్ పుట్టించేసి సరి కొత్త రికార్డ్ నెలకొల్పింది.

  English summary
  Jabardasth Anchor Rashmi Gautam song from her latest movie Guntur Talkies beats Bunny record of "cinima chupista mama" song form Resugurram in youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X