కారులో రకుల్ ప్రీత్ సెషన్.. రష్మీ కామెంట్!
బుల్లి తెర యాంకర్ రష్మీ గౌతమ్ క్రమంగా ఫైర్ బ్రాండ్‌గా మారుతోంది. నెటిజన్ల నుంచి ఎదురవుతున్న ట్రోలింగ్ ని రష్మీ ధీటుగా ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తే అంతే ఘాటుగా సమాధానం ఇస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా పాపులర్ అయిన రష్మీ కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. బోల్డ్ రోల్స్ చేసేందుకు కూడా రష్మీ సై అంటోంది. తాజాగా ఓ నెటిజన్ కు సమాధానం ఇస్తూ రకుల్ ప్రీత్ కు మద్దత్తుగా నిలిచింది.

పొట్టి బట్టలతో రకుల్
ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తులు ధరించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు హాట్ గా ఉండడంతో వైరల్ అయ్యాయి. ఓ నెటిజన్ రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తులపై అసభ్యమైన కామెంట్స్ చేశాడు. ఇప్పుడే కారులలో సెషన్ పూర్తయినట్లు ఉంది. అందుకే ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది అంటూ అసభ్య కామెంట్స్ పెట్టాడు. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే ఘాటుగా సదరు వ్యక్తికీ బుద్ది చెప్పింది.

మీ అమ్మ కూడా అంటూ
రకుల్ ప్రీత్ సింగ్ అతడి వ్యాఖ్యలకు బదులు ఇస్తూ.. మీ అమ్మకు సెషన్స్ చేసే అలవాటు ఉందేమో. అందుకే నువ్వు ఎక్స్పర్ట్ గా మారవు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళల డ్రెస్సింగ్ స్టైల్ పై పెద్ద చర్చే జరుగుతోంది. ఎస్ పి బాలసుబ్రమణ్యం. కొందరు ప్రముఖులు మహిళల వస్త్రధారణ సరిగా లేదంటూ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలని మెగా బ్రదర్ నాగబాబు తప్పు బడుతూ మహిళలకు మద్దత్తుగా నిలిచాడు. దీనికి యాంకర్ రష్మీ నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపింది.

రష్మీకి ప్రశ్న
తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ లో రష్మిని ప్రశ్నించాడు. అంతా బాగానే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ మహిళలకు మద్దత్తు తెలుపుతుంటారు. ఆలాంటి ఆమె ట్రోల్ చేసిన వ్యక్తి తల్లిని ఈ వివాదంలోకి ఎందుకు లాంగింది అని ప్రశ్నించాడు. దీనికి రష్మీ బదులిస్తూ.. అప్పుడే క్షమాపణ కూడా చెప్పింది. అయినా అదే కరెక్ట్. అలాంటి వ్యక్తులకు అర్థం కావాలంటే ఇలాంటి భాష ఉపయోగించాల్సిందే అని రష్మీ పేర్కొంది.
మహిళలని అగౌరవపరిస్తే
మహిళలందరిని రిక్వస్ట్ చేస్తున్నా మీ సోదరుడు కానీ, భర్త కానీ, తండ్రి కానీ ఎవరైనా సరే మహిళలని అగౌరవపరిచేలా మాట్లాడితే సైలెంట్ గా ఉండొద్దు. వెంటనే సరైన సమాధానం చెప్పండి అని రష్మీ ట్విటర్ లో పేర్కొంది. రష్మీ కూడా తరచుగా ఇలాంటి ట్రోలింగ్స్ ని సోషల్ మీడియాలో ఎదుర్కొంటుండడం చూస్తూనే ఉన్నాం.


Click it and Unblock the Notifications











