Just In
- 16 min ago
రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు.. పవన్ కళ్యాణ్‌పై ట్రోలింగ్.. వివరణ ఇచ్చిన నాగబాబు
- 49 min ago
చాలా ముద్దుస్తున్నాడే.. రా అంటూ స్టేజ్ మీదే బుగ్గ కొరికిన యాంకర్.. ప్రేక్షకులు షాక్
- 1 hr ago
అతడితో రిలేషన్ స్టార్ట్ చేసిన శ్రీముఖి.. హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేసి ప్రకటించింది.!
- 3 hrs ago
వెరీ ఇంట్రెస్టింగ్: బాలయ్య సినిమాలో ఛాన్స్ పట్టేసిన రష్మీ.. ఆమె వద్దంది ఈమెకు దక్కింది.!
Don't Miss!
- Lifestyle
ఈ జ్యూస్ రోజూ తాగితే పొట్ట , అధిక బరువు అదృశ్యమవుతుంది!
- News
H-1B వీసాలు: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న అమెరికా
- Sports
'Don't mess with Kohli': ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమా డైలాగ్‌తో అమితాబ్ ప్రశంస!
- Technology
ఆఫ్‌లైన్ దుకాణాలలో గొప్ప ఆఫర్లతో Vivo U20 స్మార్ట్‌ఫోన్ 8GB RAM వేరియంట్
- Finance
ఆ కార్లలో లోపాలు, 63,493 మారుతీ సుజుకీ కార్లు వెనక్కి
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రష్మీ ఇంట పెళ్లి సందడి.. లంగా-ఓణీలో జబర్దస్తీ చేసిన హాట్ బ్యూటీ.. వైరల్ పిక్స్
రష్మీ గౌతమ్.. బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇవ్వడంలో ఈ బ్యూటీని మించిన మరో నటి లేదు. రష్మీ గౌతమ్ లోని గ్లామర్ ఓ ఎత్తయితే చూపించే పర్‌ఫార్మెన్స్ మరో ఎత్తు. అందుకే ఈ జబర్దస్త్ బ్యూటీకి అంతులేని ఫాలోయింగ్. ఈ ఫాలోయింగ్‌కి రెక్కలు కట్టేలా రష్మీ వేసే చిందులు, సోషల్ మీడియా పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె వేసిన డాన్సుల తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

రష్మీ గౌతమ్ హంగామా
రష్మీ గౌతమ్ విశాఖ సిటీలో తెగ సందడి చేసింది. ఎల్లప్పుడూ ఫంక్షన్లు, ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపించే రష్మీ గౌతమ్.. ఫ్యామిలీతో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. కుటుంబ సభ్యులతో చిందేస్తూ హంగామా చేసింది.

పెళ్లి వేడుకలో జబర్దస్తీ
ఆదివారం రోజు తన సోదరుడు మలేయ్ త్రిపాఠి వివాహానికి హాజరైన రష్మీ.. ఆ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా లంగా-ఓణీ ఆకట్టుకుంది. పెళ్లి సందడి అంటే ఇదీ అన్నట్లుగా డాన్సులేస్తూ కనిపించింది.

ఆటపాటలతో అలరించిన బ్యూటీ
లంగా-ఓణీలో కనిపించి సోదరుడి పెళ్లికి మరింత కళ తెచ్చింది రష్మీ గౌతమ్.
మేళ తాళాల నడుమ ఆటపాటలతో అలరిస్తూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ.

రాజకీయ నేతలు.. రష్మీ గౌతమ్
విశాఖపట్టణంలోని పాత గాజువాకలో రష్మీ కజిన్ అయిన మేజర్ మలేయ్ త్రిపాఠి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ గీతామూర్తి దంపతులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

రష్మీ గౌతమ్ చిందులు.. వైరల్ పిక్స్
ఎప్పుడూ మోడ్రన్ దుస్తులతో కనిపిస్తూ కిక్కిచ్చే రష్మీ.. ఇలా సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో నెటిజన్లు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. పైగా రష్మీ గౌతమ్ చిందులు వేస్తూ కనిపించడం వారిలో జోష్ నింపుతోంది.

రష్మీ సిల్వర్ స్క్రీన్ జర్నీ
రష్మీ కెరీర్ సంగతులు చూస్తే.. వెండితెరపై కాలుమోపి పలు సినిమాల్లో నటించిన రష్మీకి ఆశించిన ఫలితం రానప్పటికీ సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని తన అందచందాలతో కైపెక్కించింది రష్మీ.

డిజిటల్ రంగంలోకి జబర్దస్త్ బ్యూటీ
ఇక ఇప్పుడు అమ్మడు మరో అడుగు ముందుకేసిన రష్మీ.. డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. 'ఎ ఫిలిం బై అరవింద్' దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ ద్వారా రష్మీ డిజిటల్ రంగంలో అడుగుపెడుతోంది.

అందుకే రష్మీ గ్రీన్ సిగ్నల్
ఈ వెబ్ సిరీస్ కంటెంట్ అమితంగా నచ్చడంతో రష్మీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ ఇంటర్నెట్ వేదికపై అలరించనుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌కి సంబందించిన మరో విశేషమేమిటంటే.. సీనియర్ నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో భాగం కానుండటం విశేషం.