సుడిగాలి సుధీర్‌తో అఫైర్‌పై రష్మీ క్లారిటీ.. అలా చేస్తే తప్పేంటి..

By Rajababu

టెలివిజన్‌ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా ప్రతీ ఇంటికి చేరువైన రష్మీ తాజాగా నెక్ట్స్ నువ్వే అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రష్మీ నెక్ట్స్ నువ్వే చిత్రానికి సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకొన్నారు. రష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

Recommended Video

నేను అలాంటిదానిని కాను.. కానీ సెక్సీనే..

 క్యాస్టూమ్స్ విషయంలో జాగ్రత్తగా

క్యాస్టూమ్స్ విషయంలో జాగ్రత్తగా

సినిమా అంగీకరించేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకొంటాను. ప్రత్యేకంగా క్యాస్టూమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. వాటి గురించి డైరెక్టర్, ప్రొడ్యూసర్‌తో చాలా క్లియర్‌గా క్లారిటీగా ఉంటాను.

 బికినీ ధరిస్తే తప్పేంటి?

బికినీ ధరిస్తే తప్పేంటి?

నా బాడీకి సరిపోయే దుస్తులనే నేను ధరిస్తాను. బికినీ ధరిస్తే తప్పేంటి. ఈ రోజుల్లో బికినీ అనేది చాలా కామన్ అయిపోయింది. వెకేషన్స్‌కు వెళ్లే ప్రతీ ఒక్కరు బికినీ వేసుకొంటున్నారు. దానిని బూతద్దంలో పెట్టి చూడకూడదు.

 డబుల్ మీనింగ్ డైలాగ్స్

డబుల్ మీనింగ్ డైలాగ్స్

జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండటంపై రష్మీ స్పందిస్తూ .. పెద్దవాళ్లు ఆ షో చూసినప్పుడు వారికి తెలుసు షో నుంచి ఏది తీసుకోవాలో.. ఏది తీసుకోవద్దో వాళ్లకు తెలుసు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయనే ఆ షోను 9.30 గంటలకు ప్రసారం చేస్తున్నాడు.

భయం కలిగించే సన్నివేశాలు

భయం కలిగించే సన్నివేశాలు

నెక్ట్స్ నువ్వే చిత్రానికి వస్తే.. భయం కలిగించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. నాకు ప్రత్యేకంగా పాటల లేవు. అవసరాల శ్రీనివాస్‌కు ఓ మంచి పాట ఉంది. ఆ పాటను చూసినప్పుడు నాకు అలాంటి పాట ఎందుకు రాలేదు అని ఫీలింగ్ కలుగుతుంది.

 ప్రభాకర్ చక్కగా హ్యాండిల్..

ప్రభాకర్ చక్కగా హ్యాండిల్..

ప్రభాకర్ ఈ చిత్ర కథను, నటీనటులను చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. స్వయంగా ఆయన నటుడు కావడంతో సన్నివేశాలను నటీనటులకు చక్కగా వివరించేవారు. దాంతో మా పని చాలా సులభం అయింది.

 నెక్ట్స్ నువ్వే సినిమాలో

నెక్ట్స్ నువ్వే సినిమాలో

నెక్ట్స్ నువ్వే చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉంటాయి. గడ్డివాము వద్ద కుక్క.. తినదు.. తిననివ్వదు లాంటి డైలాగ్స్ ఉంటాయి. అయితే ఈ చిత్రం యూవీ క్రియేషన్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందుతున్నది.

సినిమా చూస్తే అర్థం అవుతుంది..

సినిమా చూస్తే అర్థం అవుతుంది..

నెక్ట్స్ నువ్వే చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో ఏ సర్టిఫికెట్ హీరోయిన్ ముద్ర పడితే ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సినిమా చూస్తే నా రోల్ ఏముంటుందో అర్థమవుతుంది.

 ఆ మాట తప్పు..

ఆ మాట తప్పు..

నా పాపులారిటీని ఉపయోగించుకోవడం లేదనే మాట తప్పు. టెలివిజన్ రంగంలో బిజీగా ఉన్నాను. పరిశ్రమలో మరో పదేళ్లు ఉండాలనే ఉద్దేశంతో కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నాను. అందుకే ఎక్కువ సినిమాలను అంగీకరించడం లేదు.

 గాసిప్స్ గురించి పట్టించుకోను..

గాసిప్స్ గురించి పట్టించుకోను..

నాపై వెబ్‌సైట్లలో వచ్చే రూమర్లు, అఫైర్ల గురించి వచ్చే వార్తల గురించి పెద్దగా పట్టించుకోను. వెబ్‌సైట్లకు రాయడానికి కంటెట్ కావాలి. వాళ్లు రాస్తున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నాను. వెబ్‌సైట్లలో వచ్చే గాసిప్స్‌కు వారివద్ద ఆధారాలు లేవు అనేది వాళ్లకు తెలుసు. నాకు తెలుసు.

సుడిగాలి సుధీర్‌తో అఫైర్ లేదు..

సుడిగాలి సుధీర్‌తో అఫైర్ లేదు..

సుడిగాలి సుధీర్‌తో అఫైర్ గురించి స్పందిస్తూ.. మా మధ్య అలాంటి అఫైర్ లేదు. కొన్ని వెబ్‌సైట్లు క్లిక్స్ బిజినెస్‌ కోసం ఏదో రాస్తుంటారు. నాకు వ్యక్తిగతమైన జీవితం ఉంది. నా జీవితానికి సంబంధించి ప్రత్యేకంగా రిలేషన్స్ ఉన్నాయి. జబర్దస్త్, ఢీ షో క్రేజ్ పెంచడానికి మేము కొంత మసాలా చేర్చుతాం. దాన్ని చూసి ఏదో అనుకొంటారు. ఏదేదో ఊహించుకొంటారు. అది మా తప్పు కాదు. సుధీర్‌, నాకు మధ్య ఎలాంటి అఫైర్ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X