Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గ్లామర్ ఉంది కాబట్టే ఎక్స్పోజింగ్.. పదేళ్ల తర్వాత చూపిస్తే చూస్తారా? రష్మీ
టెలివిజన్ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా ప్రతీ ఇంటికి చేరువైన రష్మీ తాజాగా నెక్ట్స్ నువ్వే అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రష్మీ నెక్ట్స్ నువ్వే చిత్రా
బుల్లితెర మీద మోత మోగిస్తున్న సెలబ్రిటీ యాంకర్ రష్మీ గౌతమ్ అడపదడపా వెండి తెరమీద ప్రత్యక్షం అవుతున్నారు. అయితే ఆశించినంత సక్సెస్‌ను సినిమాల ద్వారా సంపాదించలేకపోతున్నారు రేష్మీ. టెలివిజన్ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా ప్రతీ ఇంటికి చేరువైన రష్మీ తాజాగా నెక్ట్స్ నువ్వే అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రష్మీ నెక్ట్స్ నువ్వే చిత్రానికి సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకొన్నారు. రష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..
నెక్ట్స్ నువ్వేలో గ్లామర్‌గా
ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో వస్తున్న నెక్ట్స్ నువ్వేలో పక్కా గ్లామర్ పాత్ర నాది. పూర్తి స్థాయిలో సినిమా అంతా చీరకట్టులో కనిపిస్తాను. నా పాత్రలో సెక్సప్పీల్ ఎక్కువగా ఉంటుంది. ముందెన్నడూ కనిపించని విధంగా నేను చాలా హాట్ హాట్‌గా ఉంటాను. ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ఉంటాను అని రష్మీ చెప్పింది.
సెక్సీ గాళ్ అనే ముద్ర
గత చిత్రాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించడం ద్వారా సెక్సీ గాళ్ అనే ముద్ర పడింది. అలా బ్రాండ్ పడినందుకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. గ్లామర్ ఉంది కాబట్టే ఎక్స్పోజింగ్ చేస్తున్నాను.
పదేళ్ల తర్వాత ఎక్స్పోజింగ్ చేస్తే
అందంగా ఉన్నాను కాబట్టి చూపిస్తున్నాను. మరో పదేళ్ల తర్వాత నేను ఎక్స్పోజింగ్ చేస్తే చూస్తారా? సమయాన్ని బట్టి, నా శరీరాకృతిని బట్టి నా పాత్రలు ఎంచుకొంటున్నాను. అందుకే ప్రేక్షకులకు, అభిమానులు ఆదరిస్తున్నారు.
నేను అందగత్తెను కాను..
ఓవర్‌గా ఎక్స్‌పొజింగ్ చేయడానికి ఇతర హీరోయిన్ల మాదిరిగా నేను అందగత్తెను కాను. నాకు 26 సెంటీ మీటర్ల నడుము లేదు. అలాంటప్పుడు బికినీ ధరించలేను. నా ఫిగర్‌కు తగినట్టుగా క్యాస్టూమ్స్ వేసుకోవడానికి ఎలాంటి సమస్య రాదు.
వైజాగ్‌లో పుట్టి పెరిగాను..
నేను వైజాగ్‌లో పుట్టిపెరిగాను. మా అమ్మ ఒడిశాకు చెందినది. నాన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. అందువల్లనే నాకు పూర్తిగా తెలుగు రాలేదు. అయినా నన్ను ప్రేక్షకులు ఆదరించారు. యాంకర్‌గా, నటిగా మంచి పాత్రలు వస్తున్నాయి.
సొంతంగా డబ్బింగ్
నెక్ట్స్ నువ్వే చిత్రంలో నేను సొంతంగా డబ్బింగ్ చెప్పాను. హారర్ చిత్రాల్లో నటించి చాలా బోర్ కొట్టింది. భవిష్యత్‌లో కుటుంబ, హాస్య చిత్రాల్లో నటించాలని అనుకొంటున్నాను.
మరో పదేళ్లు ఇండస్ట్రీలో
నా వరకు నాకు మంచి జీవితం ఉంది. నాకు నచ్చిన విధంగా జీవించడం అంటే చాలా ఇష్టం. నా జీవితంలో అసంతృప్తికి గురైన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు వినోదరంగంలో నాకు ఉన్న పొజిషన్‌తో సంతృప్తిగా ఉన్నాను. మరో పదేళ్లు ఇండస్ట్రీలో ఉండాలనుకొంటున్నాను.