నేను రెచ్చగొడుతాను.. అలాంటిదానిని కాను.. కానీ సెక్సీనే.. రష్మీ గౌతమ్ (ఇంటర్వ్యూ)

By Rajababu

Recommended Video

నేను అలాంటిదానిని కాను.. కానీ సెక్సీనే..

బుల్లితెర మీద మోత మోగిస్తున్న సెలబ్రిటీ యాంకర్ రష్మీ గౌతమ్ అడపదడపా వెండి తెరమీద ప్రత్యక్షం అవుతున్నారు. అయితే ఆశించినంత సక్సెస్‌ను సినిమాల ద్వారా సంపాదించలేకపోతున్నారు రేష్మీ. టెలివిజన్‌ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా ప్రతీ ఇంటికి చేరువైన రష్మీ తాజాగా నెక్ట్స్ నువ్వే అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రష్మీ నెక్ట్స్ నువ్వే చిత్రానికి సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకొన్నారు. రష్మీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

 నా పాత్ర పేరు రష్మీనే

నా పాత్ర పేరు రష్మీనే

నెక్ట్స్ నువ్వే చిత్రంలో నా పాత్ర పేరు కూడా రష్మీనే. ఎక్కువ సెక్సప్పీల్ ఉన్న పాత్ర. చీరలో చాలా సెక్సీగా కనిపిస్తాను. చాలా రోజుల తర్వాత సినిమాలో చీర కట్టుకొని నటించే పాత్ర దొరికింది. ఈ సినిమాలో గ్లామరస్‌గా కనిపిస్తాను. అయితే పాత్ర ఏమిటో అనే విషయం తెరమీద మాత్రమే చూడాలి. పాత్ర గురించి రివీల్ చేస్తే మజా ఉండదు.

 హాట్ హాట్ డైలాగ్స్‌

హాట్ హాట్ డైలాగ్స్‌

నెక్ట్స్ నువ్వే ట్రైలర్‌లో చూపించిన విధంగా నా పాత్ర చాలా రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. చాలా హాట్ హాట్ డైలాగ్స్‌ ఉంటాయి. శాంపిల్‌గా ఓ డైలాగ్‌ను ట్రైలర్‌లో చూపించారు. అలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయి.

 టీవీలో ఆదరించినందుకు..

టీవీలో ఆదరించినందుకు..

టెలివిజన్‌ రంగంలో తెలుగు రానీ నన్ను, నా యాంకరింగ్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అందుకు రుణపడి ఉంటాను. టెలివిజన్ రంగంలో రాణించడానికి కారణం ప్రేక్షకుల ఆదరణ. టెలివిజన్ రంగాన్ని యాంకరింగ్‌తో ఏలేస్తున్నామనడం సెకండరీ థింగ్.

 బ్రహ్మాజీకి చెల్లెలుగా

బ్రహ్మాజీకి చెల్లెలుగా

ఈ చిత్రంలో నేను బ్రహ్మాజీకి చెల్లెలుగా నటిస్తున్నాను. సినిమాలో సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో నటించిన వారందరికి తగిన ప్రాధాన్యం ఉంటుంది. పాత్రలపరంగా అందరూ హీరోలు, హీరోయిన్లే అని రష్మీ చెప్పింది.

 పాత్రల కోసం వెంపర్లాడలేదు

పాత్రల కోసం వెంపర్లాడలేదు

సెక్స్‌బాంబ్, ఎక్సోపోజింగ్ పాత్రల కోసం వెంపర్లాడలేదు. ఎవరి దగ్గరికి వెళ్లి అడుగలేదు. చీరకట్టులో ఎక్స్‌పోజింగ్ అంటే.. గామర్ ఉన్న వాళ్లు చూపిస్తే తప్ప మిగితా వాళ్లు చూపించినా అది వర్కవుట్ కాదు. అయితే ఏదీ కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు.

 నాకు 25 అంగుళాల నడుం లేదు

నాకు 25 అంగుళాల నడుం లేదు

అశ్లీల సన్నివేశాల్లో నటించడానికి నా నడుము 25 అంగుళాలు లేదు. నేను నటిస్తామన్నా అది కుదరదు. మిగితా హీరోయిన్లతో పోల్చుకుంటే నేను ఇప్పటివరకు 30 శాతం కూడా ఎక్స్‌పోజింగ్ చేయలేదు. నేను అంత అందగత్తెను కాదు. నేను చాలా నార్మల్ గర్ల్‌ను అని రష్మీ చెప్పింది.

 నేను అందగత్తెను కాను..

నేను అందగత్తెను కాను..

బాడీ పరంగా నాకు అనేక లోపాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అద్దంలో చూసుకొన్నప్పుడు నేను అందగత్తెను కాను అని నాకే అనిపించేది. నా అదృష్టం కొద్ది నాకు యాంకర్‌గా స్థిరపడ్డాను. ప్రేక్షకుల ఆదరిస్తుండటంతో రాణిస్తున్నాను.

 స్టార్ హీరోలతో నటించకపోవడానికి

స్టార్ హీరోలతో నటించకపోవడానికి

నేను స్టార్ హీరోలతో నటించకపోవడానికి కారణం ఏమీ లేదు. అవకాశం రాలేదు అందుకనే నటించలేదు. నేను ఎవరి వద్దకు వెళ్లి పాత్రల కోసం ప్రాధేయపడలేదు. ప్రస్తుతం నాకు ఉన్న అవకాశాలతో సంతృప్తి పొందుతున్నాను. ఏదైనా మంచి పాత్ర వస్తే సినిమాలు చేస్తున్నాను.

 స్టార్ హీరోలతో నటించాలని

స్టార్ హీరోలతో నటించాలని

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించాలని ఎవరికి ఉండదు చెప్పంది. నాకు ప్రభాస్, మహేశ్‌బాబు, ఇతర హీరోలతో నటించే అవకాశం వస్తే నటించడానికి సిద్దంగా ఉన్నాను. కేవలం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా నటించాలని ఉంది.

 ఐటెం సాంగ్ చేయనని చెప్పా

ఐటెం సాంగ్ చేయనని చెప్పా

గతంలో ఓ సినిమాలో ఐటెం సాంగులో నటించేందుకు ఒప్పుకొన్నాను. అయితే సగం పాట అయిన తర్వాత నేను పాటలో నటించేందుకు నిరాకరించాను. ఎందుకంటే నా స్వభావానికి విరుద్దంగా ఆ పాట చిత్రీకరణ ఉండటంతో నేను చేయను అని చెప్పి వచ్చాను అని రష్మీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X