ఏదో ఒకరోజు సుడిగాలి సుధీర్, నేను పెళ్లి చేసుకొంటాం.. కానీ.. రష్మీ గౌతమ్
రష్మీ యాంకర్‌గానే కాకుండా అందాల భామగా కూడా తెరపై గ్లామర్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటుంది. తాజాగా విడుదలైన అంతకు మించి చిత్రంలో హాట్ హాట్‌గా నటించింది. వేడి పుట్టించే సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడింది. అంతకు మించి చిత్రం గురించి, సుడిగాలి సుధీర్ గురించి పలు విషయాలను పంచుకొన్నది.
Recommended Video


రియాలిటీ షో కోసం
రియాలిటీ షో కోసం చేసిన సుడిగాలి సుధీర్‌తో పెళ్లి వైరల్‌గా మారింది. కేవలం షో కోసం అలా చేశాం. ఆ తర్వాత దానిపై వివరణ ఇచ్చాం. అయితే వాటిని ఎవరూ పట్టించుకోకుండా నిజంగా అదే మూడ్‌లో ప్రేక్షకులు ఉన్నారు. అది వాళ్ల తప్పు కాదు అని రష్మి అన్నారు.

ఏదో ఒకరోజు పెళ్లి
ఏదో రోజు నేను పెళ్లి చేసుకొంటాను. సుధీర్ తన పెళ్లి తాను చేసుకొంటాడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అప్పుడప్పుడు సుధీర్, నేను పెళ్లి గురించి మాట్లాడుకొంటాం. ఇద్దరం ఒకేసారి పక్క, పక్క వేదికలపై పెళ్లి చేసుకొందాం అని అని సూచించాను. ఎందుకంటే ఎవరు ముందు పెళ్లి చేసుకొన్నా సమస్య.

మోసం చేశారనుకొంటారు
ఒకవేళ నేను ముందుగా పెళ్లి చేసుకొంటే సుధీర్‌ని మోసం చేశానని అనుకొంటారు. అదే సుధీర్ పెళ్లి చేసుకొంటే నేను అతడిని ఆడుకొని మోసం చేశారని అనుకొంటారు. అందుకే ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకొందామని మాట్లాడుకొంటాం అని రష్మీ పేర్కొన్నది.

సుధీర్‌తో మంచి రిలేషన్
సుధీర్ గురించి చెప్పాలంటే చాలా వర్కింగ్ ప్రొఫెషనల్. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. నేను ఏమన్నా అంటే తాను అర్థం చేసుకొంటాడు. తను ఏమన్నా అంటే నేను అర్థం చేసుకొంటాను. అందుకే మా మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి.

అంతకు మించి సినిమా
అంతకు మించి చిత్రంలో నా తొడలపై పెద్దగా కామెంట్స్ వస్తున్నాయి. రొమాన్స్ అనేది కేక్ మీద చెర్రీ లాంటింది. సినిమాలో మంచి కథ ఉంది. దానిని పట్టించుకోకుండా అనేక వివాదాలు సృష్టిస్తున్నారు. సినిమా చూస్తే అసలు విషయం తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











