Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2’ చేస్తానందా? వివాదంలో యాంకర్ రష్మి, ఇదీ అసలు సంగతి!
Recommended Video
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'(జీఎస్టీ) షార్ట్ ఫిల్మ్ ఓ సంచలనం. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈచిత్రానికి మంచి స్పందన రావడంతో 'జీఎస్టీ-2' కూడా తీయడానికి సిద్ధమయ్యారు వర్మ. అయితే యాంకర్ రష్మి తాజాగా సోషల్ మీడియా ద్వారా .... తాను 'జిఎస్టీ-2'లో నటించడానికి సిద్ధమే అని ప్రకటించినట్లు వార్తలు రావడం వివాదానికి దారి తీసింది.
‘జీఎస్టీ 2’లో నటిస్తారా? అనే ప్రశ్నకు...
రష్మి తన ట్విటర్ ఫాలోవర్స్‌తో బుధవారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ ఆఫర్ చేస్తే ‘GST 2'లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దానికి రష్మి స్పందిస్తూ ‘I'll do a GT 2 if @praveenSattaru directs it' అంటూ సమాధానం ఇచ్చారు. GT 2 అంటే ‘గుంటూరు టాకీస్ 2' అని అర్థం.
తప్పుగా అర్థం చేసుకున్న నెటిజన్లు
అయితే రష్మి ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న నెటిజన్లు ఆమె ‘GST 2'లో చేయడానికి నేను సిద్ధమైంది అంటూ రకరకాల కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. కొన్ని వెబ్ సైట్లలో కూడా రష్మి ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్-2' చేయడానికి ఓకే చెప్పింది అంటూ వార్తలు వచ్చాయి.
ట్వీట్ డిలీట్ చేసిన రష్మి
తన ట్వీట్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడంతో వెంటనే రష్మి దాన్ని డిలీట్ చేసింది. నేను GST 2 చేస్తాను అని చెప్ప లేదు GT 2 చేస్తాను అని మాత్రమే చెప్పాను అని వివరణ ఇచ్చారు.
ప్రవీణ్ సత్తారుతో రష్మి
గతంలో రష్మి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ‘గుంటూరు టాకీస్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే రష్మి ఎవరూ ఊహించని విధంగా అందాల ఆరబోత చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముద్దు సీన్లు, పడకగది సీన్లు, బికినీ సీన్లతో ఆమె బాగా పాపులర్ అయ్యారు.
రష్మికి నచ్చిన దర్శకుడు
రష్మి మాటలు బట్టి చూస్తే ప్రవీణ్ సత్తారు పని తీరు, తనను తెరపై వల్గారిటీ లేకుండా సెక్సీగా చూపడం ఆమెకు బాగా నచ్చిందని స్పష్టం అవుతోంది. ఆ దర్శకుడితో మరోసారి గుంటూరు టాకీస్ సీక్వెల్ చేయడానికి సిద్ధమే అని ప్రకటించడం ద్వారా తాను తెరపై మరోసారి హాట్ హాట్‌గా అందాలు ఆరబోయడానికి సిద్ధమే అని చెప్పకనే చెప్పింది. మరి రష్మి మాటలు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు వరకు వెళ్లాయో? లేవో?
గురుడ వేగతో ఫాంలోకి
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘గరుడవేగ' చిత్రం 2017లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో ప్రవీణ్ సత్తారు పేరు మార్మోగిపోయింది. త్వరలో నితిన్ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.