twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించబడ్డాను: హోళీ వేళ వివాదంగా యాంకర్ రష్మి ట్వీట్

    |

    హోళీ పెస్టివల్ సందర్భంగా ట్విట్టర్లో రష్మి చేసిన ఓ కామెంట్ కొందరికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమెపై 'హిందూ వ్యతిరేకి' అంటూ నిందలు వేయడం మొదలు పెట్టారు. హోళీ సందర్భంగా జంతువులకు రంగులు పూయకండి, సేఫ్‌గా హోళీ జరుపుకోండి అంటూ రష్మి చేసిన కామెంట్ ఈ వివాదానికి కారణమైంది.

    మార్చి 21న హోళీ ఉత్సవం జరుగబోతున్న నేపథ్యంలో... ట్విట్టర్లో రంగులు పూయబడి ఉన్న కుక్క ఫోటో షేర్ చేసిన రష్మి 'మనుష్యులు హోళీ పేరుతో నాకు కూడా రంగులు పూస్తున్నారు, దాని వల్ల నాకు స్కిన్ ఎలర్జీ వస్తోందని ఆ కుక్క బాధపడుున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.' రష్మి పెట్టిన ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

    రష్మిపై ఫైర్

    రష్మిపై ఫైర్

    రష్మి చేసిన ఈ కామెంట్స్, జంతువుల పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమకు కొందరు అభిమానులు ఇంప్రెస్ అయినప్పటికీ... మరికొందరు మాత్రం కౌంటర్ ఇచ్చారు. జంతువులకు హాని కలుగుతోందనే సాకుతో హిందువులు హోళీ జరుపుకోకుండా రష్మి లాంటి వారు అడ్డు పడుతున్నారంటూ మండి పడ్డారు.

    మతం గురించి ఎవరు అడిగారు?

    మతం గురించి ఎవరు అడిగారు?

    రష్మి ట్వీట్ మీద ఓ నెటిజన్ స్పందిస్తూ...‘నువ్వు ఇదే కామెంట్ ఈద్ రోజున చేయగలవా? ఆ రోజున ఎన్నో జంతువులు వధించబడతాయి.. హోళీ, దివాపాళి రోజునే నీకు జంతువుల మీద ప్రేమ పుట్టుకు వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ... ‘‘ఏ సందర్భంలో అయినా నా ఎమోషన్ ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మతం గురించి ఎవరు అడిగారు? '' అని ఎదరు ప్రశ్నించారు.

    ఆ రాత్రి నా తప్పేమీ లేదు.. దారుణంగా ఫొటోలు, వీడియోలు తీశారు.. మనుషులేనా? యాంకర్ రష్మీఆ రాత్రి నా తప్పేమీ లేదు.. దారుణంగా ఫొటోలు, వీడియోలు తీశారు.. మనుషులేనా? యాంకర్ రష్మీ

    ఇది సేమ్ ఎమోషన్ ఎలా అవుతుంది?

    ఇది సేమ్ ఎమోషన్ ఎలా అవుతుంది?

    రష్మి ఇచ్చిన సమాధానంపై మరొక వ్యక్తి రియాక్ట్ అవుతూ... ఆ విషయం అడగ్గానే దాక్కునే ప్రయత్నం చేయవద్దు. నువ్వు హిందూ ఫెస్టివల్స్ సమయంలో జంతువుల గురించి మాట్లాడతావు... బక్రీద్ సందర్భంగా జంతువులపై జరుగుతున్న హింస గురించి ఎందుకు మాట్లాడవని ప్రశ్నిస్తే ఏదో కారణం చెబుతున్నావు? ఇది సేమ్ ఎమోషన్ ఎలా అవుతుంది?' అంటూ ప్రశ్నించారు.

    హిందువులు కూడా జంతువులను చంపుతున్నారు కదా

    హిందువులు కూడా జంతువులను చంపుతున్నారు కదా

    దీనిపై రష్మి స్పందిస్తూ... నేను హిందూ కాబట్టి హిందూ ఫెస్టివల్ మీద మాట్లాడతాను. ఇతర మతాల ఆచారాల గురించి నాకు తెలియదు కాబట్టి నేనెలా మాట్లాడగలను అని రష్మి తెలిపారు. ఈ వాదన జంతువుల సమస్య కంటే మతపరమైన అంశాలపై ఎక్కువ జరుగుతుందన్నారు.

    హిందువులు కూడా బలి పేరుతో జంతువుల ప్రాణాలు తీస్తున్నారు కదా... గదిమా ఫెస్టవల్ లాంటివి ఆపాలని చాలా పిటీషస్లు కూడా పడ్డాయి. ఇప్పటికీ ఆచారాల పేరుతో జంతు బలులు జరుగుతున్నాయని మరో పశ్నకు రష్మి సమాధానం ఇచ్చారు.

    వాటికి బాత్ రూములు ఉండవు

    సేఫ్ హోళీ జరుపుకోండి, జంతువులకు రంగులు పూయకండి అని పోస్ట్ పెట్టినందుకు కొందరు నన్ను వారి కామెంట్లతో నిరాశ పరిచారు. అందరికీ చెబుతున్నది ఒకటే.. జంతువులకు రంగులు పూయకండి, వాటికి మనలా బాత్రూములు, షవర్లు ఉండవు. స్కిన్ డిసీజ్ వస్తే అవి మనలాగా ఆసుపత్రికి వెళ్లలేవు... అని రష్మి తెలిపారు.

    ఈ రోజు నేను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడ్డా

    ఈ ఇష్యూలో రష్మికి కామెంట్ల మీద కామెంట్స్ వస్తూనే ఉండటంతో...‘ ఈ రోజు నేను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడ్డాను. రేపు బ్రక్రీద్ సందర్భంగా జంతు హింస గురించి మాట్లాడితే ముస్లిం వ్యతికిగా డిక్లేర్ చేస్తారు. నాకు చివరగా అర్థమైంది ఒకటే.. ‘‘జంతువుల పట్ల జరుగుతున్న అమానుషమైన చర్యల గురించి ఎవరూ పట్టించుకోరు'' అన్నారు.

    English summary
    "Today I’m presumed as ANTI HINDU when I’ll raise awareness on a bakrid I’ll be declared ANTI MUSLIM. Bottom line no one cares about inhumane practices towards animals all they care about is which religion tat human or practice belongs to. We are still divided hence we remain weak." Rashmi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X