మిలియనీర్ల జాబితాలో జబర్దస్త్ యాంకర్ రష్మి
హైదరాబాద్: జబర్దస్త్ కామెడి షో యాంకర్ రష్మి మిలియనీర్ల జాబితాలో చేరి పోయింది. మిలియనీర్ అంటే ఆమె ధనవంతరాలు అయిందనుకుంటే పొరపాటే...ఈ మధ్య ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మిలియన్ మార్క్ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం ట్రెండ్‌గా మారింది. తాజాగా రష్మి ఫేస్ బుక్ పేజీని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 1 మిలియన్( 10 లక్షలు) మార్కను దాటింది. మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా కొన్ని రోజుల క్రితమే మిలియన్ మార్కను అందుకున్న సంగతి తెలిసిందే.
ఈటీవీలో ప్రసారం అవుతున్న 'జబర్దస్త్ కామెడీ షో' అనే కార్యక్రమానికి యాంకరింగు చేస్తున్న రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెక్సీగా, చలాకీగా యాంకరింగు చేస్తూ ఈ కామెడీ ప్రోగ్రాంకి గ్లామర్ టచ్ ఇస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో ప్రేక్షకులను కవ్విస్తోంది. రష్మి కేవలం యాంకర్ మాత్రమే కాదు, జబర్దస్త్ కంటే ముందే ఆమె పలు చిత్రాల్లో నటించింది.

అయితే రష్మికి బాగా గుర్తింపు, పాపులారిటీ వచ్చింది మాత్రం 'జబర్దస్త్' కార్యక్రమమే అని చెప్పక తప్పుదు. ఈ కార్యక్రమం వల్లనే ఆమె సెలబ్రిటీ హోదా సొంతం చేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా.....పాపులారిటీ ఉన్నపుడే ఫాలోయింగ్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్న రష్మి.....సోషల్ నెట్వర్కింగు ద్వారా హాట్ ఫోటోలు, ఆసక్తికర ఫోటోలు పోస్టు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.
రష్మి ఏప్రిల్ 7, 1989లో ఒరిస్సాలో జన్మించింది. మోడలింగ్ రంగం నుండి ఎంటర్టెన్మెంట్స్ రంగం వైపు అడుగులు వేసిన రష్మి యాంకర్‌గా, నటిగా తన ప్రస్తానం సాగించింది. 2007లో ‘యువ' అనే టీవీ కార్యక్రమంలో రష్మి నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘జబర్దస్త్ కామెడీ షో'లో యాంకరింగు చేస్తోంది. సూపర్ కుటుంబం అనే కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











