twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాటిపై రంగు పడితే అంటూ రష్మీ.. నెటిజన్ కామెంట్.. జబర్దస్త్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్!

    |

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెటిజన్లకు, సెలబ్రిటీలకు మధ్య దూరం చాలావరకు తగ్గిపోయింది. ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకుంటూ తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకుంటున్నారు. ఇటు సెలబ్రిటీలకు తమ సందేశాలు చేర్చడం సులువు కాగా, అటు నెటిజన్లకు వాటిపై తమ రెస్పాన్స్ తెలియజేయడం మరింత సులువైంది. ఈ నేపథ్యంలోనే కొన్నిసార్లు కొందరు సెలబ్రిటీలపై విమర్శలు కూడా వస్తున్నాయి. తాజా యాంకర్ రష్మీ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి పోతే..

    జబర్దస్త్ బ్యూటీ.. యమ యాక్టివ్

    జబర్దస్త్ బ్యూటీ.. యమ యాక్టివ్

    జబర్దస్త్ బ్యూటీగా అందరికీ సుపరిచితం యాంకర్ రష్మీ. కేవలం ఈ ఒక్క షో ద్వారానే తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ బ్యూటీ. అటు ఇకపోతే సోషల్ మీడియాలోనూ యమా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సామాజిక అంశాల స్పందించడం, తన వ్యక్తిగత విశేషాలు తెలపడం లాంటివి చేస్తుంటుంది రష్మీ.

    నెగెటివ్ కామెంట్స్.. రష్మీ కౌంటర్లు

    నెగెటివ్ కామెంట్స్.. రష్మీ కౌంటర్లు

    తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తూ ఏదో ఒక పోస్ట్ చేయడం, వాటికి నెటిజన్లు కామెంట్లు చేయడం, అలా వచ్చిన వాటిలో నెగెటివ్ కామెంట్స్ వస్తే.. తిరిగి మళ్లీ కౌంటర్స్ వేయడం రష్మీకి అలవాటే. దీంతో అవి కాస్తా వైరల్ కావడం, వార్తల్లోకెక్కడం జరుగుతూ వస్తోంది. తాజాగా అలాంటి ఘటనే మరోసారి రిపీట్ అయింది.

    హోలీ పండుగ.. రంగు పడితే అంటూ రష్మీ

    హోలీ పండుగ.. రంగు పడితే అంటూ రష్మీ

    హోలీ పండుగ సందర్భంగా రష్మీ చేసిన కామెంట్ చర్చల్లో నిలిచింది. ''హోలీ వస్తుంది. కుక్కలపై రంగులు చల్లకండి. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కోవచ్చు. కానీ జంతువులు ఆ పని చేయలేవు'' అని రష్మి ట్వీట్ చేసింది. ఒకరకంగా రష్మీ చేసిన ఈ ట్వీట్‌లో అర్థముంది.

    అలాంటి సందేశాలు.. రష్మీ స్ట్రాంగ్ రిప్లై

    అలాంటి సందేశాలు.. రష్మీ స్ట్రాంగ్ రిప్లై

    అయితే ఈ ట్వీట్‌ చూసిన ఓ నెటిజన్‌ ''అచ్చా.. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తుంటాయా? మన పండగల ప్రతిష్టను తగ్గించేలా మీరు ఇలాంటి సందేశాలు ఇస్తున్నారా'' అని కౌంటర్ వేశాడు. దీంతో వెంటనే రష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ''నాపై ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఒకసారి నేను గతంలో చేసిన పోస్టులను, నా పేజ్‌ను చెక్ చేయండి'' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

    Recommended Video

    Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !

    రష్మీ ప్రేమ.. అలా చెబుతూ ఉంటుంది

    సాధారణం గానే యాంకర్ రష్మీకి శునకాలంటే చాలా ప్రేమ. అందుకే ఆమె కుక్కలా విషయంలో ఆమె ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. శునకాలకు ఎలాంటి హానీ తలపెట్టకండి అంటూ నెటిజన్లకు రిక్వెస్ట్ చేస్తుంటుంది. అంతేకాదు ఓ చిన్న కుక్కపిల్లను కూడా పెంచుకుంటోంది రష్మీ.

    English summary
    Rashmi Gautam Opens her voice about animals. She fired on netijans regarding dogs issue. Recently she posted a message on Holi celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X