హాట్ ‘వ్యూహం’:యాంకర్ రష్మి హీరోయిన్‌గా (ఫోటోస్)
హైదరాబాద్: ‘జబర్దస్త్ కామెడీ షో' ద్వారా యాంకర్‌గా అందరికీ సుపరిచితమైన రష్మి గౌతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం మాటకారితనమే కాదు....ఆకట్టుకునే హాట్ అండ్ సెక్సీ అందాలు ఆమె సొంతం. వెండితెరపైనే చిట్టి పొట్టి దుస్తులతో యువత గుండెల్లో గుబులు రేపిన ఈ భామ త్వరలో వెండితెరను వేడెక్కిచబోతోంది.
శ్రీ గాయత్రి ఆర్ట్ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘వ్యూహం' చిత్రంలో రష్మి నటిస్తోంది. చరణ్‌దీప్ హీరోగా నటిస్తున్నాడు. జిఎస్‌పి కల్యాణ్ దర్శకత్వంలో అట్లూరి సురేష్‌బాబు రూపొందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసారు.
నిర్మాత మాట్లాడుతూ- కథకు సరైన పేరుగా ‘వ్యూహం' నిర్ణయించాం. విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపిన చిత్రానికి సంబంధించిన మరొక ఫైట్, పాట బ్యాలెన్స్ ఉంది. జబర్దస్త్ ఫేమ్ రేష్మిగౌతమ్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో పూర్తిచేసి విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వాసుదేవ్, సంజయ్, సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు

గతంలో కన్నడ చిత్రాల్లో...
తెలుగులో యాంకర్ గా ఎంట్రీ ఇవ్వక ముందు రష్మి పలు కన్నడ చిత్రాల్లో హీరోయిన్ నటించింది.

తెలుగులో గుర్తింపు
తెలుగులో నేరుగా హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నించకుండా ముందు యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

దర్శక నిర్మాతల దృష్టిలో
తన హాట్ అండ్ సెక్సీ ఆటిట్యూడ్, మాటకారితనంతో రష్మి టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది.

వ్యూహాత్మకంగా...
హీరోయిన్ కావాలనే టార్గెట్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రష్మి ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

వ్యూహం
శ్రీ గాయత్రి ఆర్ట్ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘వ్యూహం' చిత్రంలో రష్మి నటిస్తోంది.

హీరో, దర్శకుడు
చరణ్‌దీప్ హీరోగా నటిస్తున్నాడు. జిఎస్‌పి కల్యాణ్ దర్శకత్వంలో అట్లూరి సురేష్‌బాబు రూపొందిస్తున్నారు.

రష్మి హైలెట్
వ్యూహం చిత్రంలో రష్మి నటించడంమే ఆ చిత్రానికి హైలెట్. ఎందుకంటే...ఆమెకు ఉన్నంత గుర్తింపు హీరో, దర్శుకడు, నిర్మాతలకు లేదు.


Click it and Unblock the Notifications











