ఇకపై రష్మీ అందాలకు కొత్త రూపం.. ఎంజాయ్ చేయొచ్చు.. కియారా లాగే ఈమె కూడా!
Recommended Video
రష్మీ గౌతమ్.. ఈ పేరు వింటేనే బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌లో ఆడో కిక్కు. ఆమె లోని గ్లామర్ ఓ ఎత్తయితే చూపించే పర్‌ఫార్మెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా రష్మీకి అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌కి రెక్కలు కట్టేలా వెండితెరపై కాలుమోపి పలు సినిమాల్లో నటించిన రష్మీకి ఆశించిన ఫలితం రానప్పటికీ సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని తన అందచందాలతో కైపెక్కించింది. ఇక ఇప్పుడు అమ్మడు మరో అడుగు ముందుకేసి డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. ఆ వివరాలు చూద్దామా..

పెరుగుతున్న డిజిటల్ జోరు.. వర్మ, కియారా
సాంకేతిక పరిజ్ఞానం ఊపందుకున్న ఈ రోజుల్లో డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తోంది. సమాజం కూడా డిజిటల్ రంగాన్ని బాగా ఆదరిస్తోంది. దీంతో పలువురు సినీ తారలు, దర్శకనిర్మాతలు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, కియారా అద్వానీ లాంటి తారలు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై అడుగు పెట్టేశారు.

సౌత్ సినిమా బ్యూటీ కాజల్ కూడా
సౌత్ సినీ ఇండస్ట్రీలో దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్ అగర్వాల్ కూడా డిజిటల్ రంగం వైపు అడుగు వేస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న వెబ్ సిరీస్‌లో గ్లామరస్ తార కాజల్ అగర్వాల్ నటించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం పది భాగాలుగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక తాజాగా రష్మీ గౌతమ్ కూడా ఇదే బాట పట్టిందని ఫిలిం నగర్ టాక్.

వినగానే నచ్చడంతో రష్మీ..
'ఎ ఫిలిం బై అరవింద్' దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ ద్వారా రష్మీ డిజిటల్ రంగంలో అడుగుపెడుతోంది. ఈ వెబ్ సిరీస్ కంటెంట్ అమితంగా నచ్చడంతో రష్మీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ ఇంటర్నెట్ వేదికపై అలరించనుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌కి సంబందించిన మరో విశేషమేమిటంటే.. సీనియర్ నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ కూడా ఈ వెబ్ సిరీస్‌లో భాగం కానుండటం.

సెన్సార్ సమస్యలు లేవు కదా.. అందుకేనేమో!
ఇటీవల కాలంలో పలువురు తారలు సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లపైనే నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సెన్సార్ సమస్యలు లేకపోవడంతో.. కథను ఎలాగైతే ప్రెసెంట్ చేయనుంకుంటున్నారో యధాతథంగా అదే తెరకెక్కించేందుకు ఆస్కారం ఉంది. అందుకే ఎక్కువమంది దర్శకులు, నటీ నటులు వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారని చెప్పుకోవచ్చు.

రష్మీ గౌతమ్ హంగామా
ప్రస్తుతం రష్మీ గౌతమ్ బుల్లితెరపై పలు టీవీ షోస్ ద్వారా హంగామా సాగిస్తోంది. గుంటూరు టాకీస్, బలపం పట్టి భామ ఒడిలో, నెక్స్ట్ నువ్వే లాంటి సినిమాలతో వెండితెరపై అదృష్టం పరీక్షించుకున్న ఈ భామ.. ఇక డిజిటల్ రంగంలోనూ లక్ పరీక్షించుకోనుంది.


Click it and Unblock the Notifications











