నేను మారడానికి కారణం అదే.. ప్లీజ్ ఈ వీడియో చూడండి.. రష్మీ గౌతమ్ ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలెబ్రిటీల్లో జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. బుల్లితెరపై వినోదాల విందు చేస్తూనే నెట్టింట వివిధ అంశాలపై తనదైన కోణంలో స్పందించడం అమ్మడిలో ఆకర్షణీయం. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై ఫోకస్ పెట్టి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తూ వస్తోంది రష్మీ. ఈ కోవలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి పోతే..

రష్మీ గౌతమ్ సామాజిక స్పృహ
బుల్లితెరపై జబర్దస్త్ అందాలతో మత్తెక్కించడమే కాదు.. రష్మీ గౌతమ్‌లో సామాజిక స్పృహ కూడా ఎక్కువే. సామాజిక అంశాల పట్ల స్పందించడంలో ఎప్పుడూ ముందే. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణపై గానీ రష్మీ రియాక్ట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

జంతు వధపై రష్మీ ఆవేదన
మూగ జీవాల పట్ల ప్రేమగా ఉండే రష్మీ గౌతమ్.. తాజాగా జంతు వధపై ఆవేదన చెందుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో జంతువులను చంపేస్తున్న వీడియో పోస్ట్ చేసి తనదైన శైలిలో సందేశమిచ్చింది. మూడు నిమిషాల వీడియోను చూడండని, ఈ వీడియో చూస్తే మరోసారి మాంసాహారం ముట్టరని తెలిపింది.
అదే నా పద్ధతుల్ని మార్చేసింది
నా కుక్క పిల్ల నా ఆహార పద్దతులను మార్చేసిందని ఈ సందర్బంగా రష్మీ గౌతమ్ పేర్కొంది. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోలో జంతు వధను చూస్తే నిజంగానే మాంసాహారం ముట్టరని చెప్పుకోవచ్చు. ఇలా మూగ జీవాల సేఫ్టీ పట్ల రష్మీ తన వంతుగా సోషల్ మీడియా అవగాహాన కల్పించడం పట్ల పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Recommended Video

విమర్శలను తిప్పికొడుతూ ఫైర్
సోషల్ మీడియా ట్వీట్స్ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేయడమే గాక, సామాజిక అవగాహన కల్పించడంలో ముందుండే రష్మీ గౌతమ్.. ఇటీవలే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన అయోధ్య కేసు తీర్పుపై కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో జై శ్రీరామ్ అంటూ పోస్ట్ పెట్టిన ఈ అమ్మడు, తనపై వివిధ కారణాలు చూపుతూ వచ్చిన విమర్శలను సైతం తిప్పికొట్టింది.


Click it and Unblock the Notifications











