»   » పార్టీలో తాగి నానా రచ్చ యాంకర్ రేష్మి చేసిందా, ఏం ఆశించి ఇదంతా?

పార్టీలో తాగి నానా రచ్చ యాంకర్ రేష్మి చేసిందా, ఏం ఆశించి ఇదంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా యూ ట్యూబ్ లో ఓ వీడియో రన్ అవుతోంది. ఆ వీడియో యాంకర్ రేష్మి పై చేసింది. ఆ వీడియో లో నిజమో, అబద్దమో, ఏ సాక్ష్యమూ లేకుండా ఓ దారుణమైన న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఆ న్యూస్ వింటే మనకూ ప్రాణం ఉసూరు మనిపిస్తుంది. కేవలం వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలను తయారు చేస్తున్నారా అనే కోపం కూడా వస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందయ్యా అంటే...

తాజాగా యాంకర్ రేష్మి ... ఓ ప్రెవేట్ ఫంక్షన్ కు వెళ్లిందట. అయితే అక్కడ ఆమె బాగా తాగి నానా రచ్చ రచ్చ చేసింది. నానా బీభత్సం చేసింది. ఇలా ఓవర్ గా తాగేసి రోడ్డుపైకి వచ్చి కూడా వీరంగం ఆడింది. ఇది తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కౌన్సలింగ్ ఇప్పించి వదిలారట అని.

అయితే ఓ అభిమాని ఈ వీడియోని రేష్మి దాకా తీసుకువెళ్లారు. ట్విట్టర్ లో ఆమెకు ఈ వీడియో ని షేర్ చేసి,విషయం తెలియబరిచారు. ఇది చూసిన రేష్మి...ఓ రేంజిలో మండిపడింది. వెంటనే ఖండన అక్కడే ప్రకటించింది. దమ్ముంటే తాను తాగినట్లుగా ప్రూవ్ చేయమని ఛాలెంజ్ సైతం చేసింది. ఆ ట్వీట్స్ మీకు ఇక్కడ అందిస్తున్నాం.

ఇదంతా అర్దంలేని పని లేని న్యూస్

ఇలాంటి అర్దం లేని వీడియోలని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. రేష్మికి అలాగే వచ్చింది. ఆమె వెంటనే ఇది బుల్ షిట్ న్యూస్ అని ఖండించింది. ఇంకా ఆమె ఏమి అన్నారో ఇక్కడ చూడండి.

ఇలాంటి వాటి వల్ల సమయం...

ఇలాంటి న్యూస్ లను నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. ఇలాంటి వాటి వల్ల సమయం వృధా తప్ప ఫలితం ఉండదు. ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. ఇలాంటి వాటిని నేను నిజంగా పట్టించుకోను అన్నారు.

వేరే వాళ్లకి..

ఇలాంటివి న్యూస్ లు వేరే వాళ్లకి పే చెక్ లు మాత్రమే అంటూ మీరు ఈ విషయమై స్పందించండి. మీరు స్ట్రాంగ్ ఉమెన్ అని తెలుసు అన్నప్పుడు ఇలా చెప్పుకొచ్చారామె.

ఆధారం లేనిదే

ఇలాంటివన్నీ ఆధారంలేని వార్తలే. ఇలాంటివి పట్టించుకోవాల్సిన పనిలేదని రేష్మి తను భావిస్తున్నట్లుగా స్పష్టంగా తెలియచేసారు. ఓ రకంగా ఆమె స్పందన ఇలాంటి వీడియో చేసినవారికి చెంపపెట్టులాంటిదనే చెప్పాలి.

మామూలు పాపులారిటి కాదు

మామూలు పాపులారిటి కాదు

తొలి రోజుల్లో సినిమాల్లో చిన్ని చిన్న పాత్రలు చేసి, వాటితో పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో, ఇక లాభం లేదనుకుని ‘జబర్ధస్త్'తో యాంకర్‌గా బుల్లితెరపైకి వచ్చిన ఈ బోల్డ్ భామ తక్కువ కాలంలోనే పుల్ పాపులారిటీ సంపాదించేసిందనే చెప్పాలి.

మళ్లీ సినిమాల్లో...

మళ్లీ సినిమాల్లో...

ఇక నిన్నటి వరకు యాంకర్ గా రేష్మి ఎంత పేరు తెచ్చుకుందంటే...ఆమె ఎవరనేది తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ అందరికీ తెలుసు. అంతలా పేరు పొందిన రేష్మి మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతు౦ది. అ౦తకుము౦దు కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించినా గుంటూరు టాకీన్ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది. ఆ చిత్రంతో పరిశ్రమ దృష్టిలో పడింది.

ఆమె క్రేజ్ ని క్యాష్ చేద్దామనే ..

ఆమె క్రేజ్ ని క్యాష్ చేద్దామనే ..

గుంటూరు టాకీస్ సక్సెస్ తర్వాత సినిమాల్లో వరసగా అవకాశాలు రావటంతో బిజీగా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో మంచి పెర్ఫార్మేన్స్ ఇస్తోందనే పేరు తెచ్చుకుంది. అయితే బ్యాడ్ ఏమిటంటే..ఆమెకు అన్నీ చిన్న సినిమాలే వస్తున్నాయి. ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనే దర్శక,నిర్మాతలే దొరుకుతున్నారు.

కలిసిరాలేదు

కలిసిరాలేదు

గుంటూరు టాకిస్ చిత్రం తరువాత రేష్మి నటి౦చిన చిత్రం కావట౦తో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మరో చిత్రం రాణి గారి బంగళా కుడా విదుదలైంది. ఈ చిత్రాన్ని యువదర్శకుడు డి.దివాకర్ కాగా ప్రముఖ నిర్మాత ఏ౦. బాలాజీ నాగలి౦గ౦ సమర్పించారు, నిర్మాత లీనా ప్రసాద్. కానీ ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఫలితం లేదు

ఫలితం లేదు

ఆ తర్వాత శ్రీ అచ్యుత్ ఆర్ట్స్ బ్యానర్ ఫై నిర్మించిన చిత్రం తను వచ్చేనంట. ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకుడు. రేష్మి సరసన తేజ కాకుమాను, ధన్య బాలకృష్ణన్ నటించిన ఈ చిత్రం మీద కూడా బారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.

రేంజి పెరిగింది, దాంతో

రేంజి పెరిగింది, దాంతో

గుంటూరు టాకీస్ సినిమాతో వెండితెర‌పై హాట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో రేష్మి వెండితెర మీద హాట్ హాట్‌గా త‌న అందాలు ఆర‌బోయ‌డంతో ఆమెకు వెండితెర మీద కూడా మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇటివలే రిలీజ్ అయిన అంతం సినిమాతో రేష్మి రేంజ్ పెరిగిపోయిదని అంటున్నారు. దాంతో రేష్మి ఈ చిత్రం తర్వాత రెమ్యునరేషన్‌ భారిగా పెంచేసిందట.

దీపం ఉండగానే...

దీపం ఉండగానే...

సినిమాలో నటించడానికి తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటు పబ్లిసిటీకి రేష్మీ స‌ప‌రేట్ ప్యాకేజ్ అడుగుతోంద‌ని చెప్పుకుంటున్నారు‌. డిమాండ్ ఉన్న‌ప్పుడు క్యాష్ చేసుకుంటే మంచిదే కదా అంటుంది రేష్మి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని.. ఆ ఫార్ములాని ముద్దుగుమ్మ రేష్మి బాగా క్యాష్‌ చేసుకుంటుందని అంటున్నారు.

షాక్ ఇస్తోందిట

షాక్ ఇస్తోందిట

రేష్మితో సినిమా తీయాలని ఆమెను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అడుగుతుంటే.. రేష్మి మాత్రం చెపుతున్న రేటు, కండీష‌న్లు, ప్ర‌మోష‌న్‌కు స‌ప‌రేట్ ప్యాకేజీలు ఇలా ఇవ‌న్నీ విని వారు అమ్మో రేష్మి తో సినిమా తీయాలంటే అన్ని కండీష‌న్లా అని షాక్ అవుతున్నారట. మొత్తాన్నికి రేష్మి రేంజ్ పెరగడంతో రేటు కూడా పెచ్చేసిందని అంటున్నారు. అయితే కేవలం ఆమె క్రేజ్ తోనే సినిమా తీయాలనుకున్నప్పుడు ఆమె పెంచితే తప్పేంటి.

ఎక్కడా కనిపించలేదు

ఎక్కడా కనిపించలేదు

తన మొదటి చిత్రం గుంటూరు టాకీస్ చిత్ర ప్రమోషన్ లో జోరు గా పాల్గొన్న రేష్మి ఆ తర్వాత చిత్రం అంతం ప్రమోషన్ లో మాత్రం ఎక్కడ కనిపించలేదు..అయినా కానీ చిత్ర దర్శక , నిర్మాతలు రేష్మి పేరును బాగానే వాడుకుంటున్నారు.. పోస్టర్స్ , ట్రైలర్స్ ఇలా అన్నిటిలోను రేష్మి ని హైలైట్ చేస్తున్నారు..కాకపోతే ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం రేష్మి పారితోషికం విషయంలో ఏవో గొడవలొచ్చినట్టున్నాయని, అందుకే రేష్మి సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతం కూడా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

ఎఫైర్ ఉందో లేదో చెప్పను

ఎఫైర్ ఉందో లేదో చెప్పను

సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ గురించి మాట్లాడుతూ 'సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ ఉందో, లేదో నేను చెప్పను. సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ గురించి మాత్రం బాగా ప్రచారం చేయండి. బాగా రాయండి. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఆ విధంగానైనా ట్రెండ్‌ అవడం మంచిదే. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందులేమీ లేవు. నా లవ్‌ఎఫైర్‌ గురించే మాట్లాడుకోండి' నాకు కావాల్సింది పబ్లిసిటీ అని తెగేసిచెప్పేసిందట రేష్మి.

సహజీవనం గురించి

సహజీవనం గురించి

జబర్దస్త్ కామెడీ షో సమయంలో సుధీర్, రష్మి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఇప్పటివరకు కేవలం గాసిప్స్‌గానే ఉండిపోయాయి. నిజానిజాలు ఏమిటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

English summary
There is a rumor or fake news report on popular actress-anchor Rashmi Gautam. One of Rashmi's fans brought it to her notice and here is how gutsy Rashmi responded. Now She comes up clarifying the reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu