తన ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ ని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ.. రష్మిక స్కెచ్ మామూలుగా లేదుగా..

Vijay Deverakonda -Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందాన.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు అందుకున్న ఈ అమ్మడు పుష్ప 2 సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో పాన్ ఇండియా సక్సెస్ పుల్ హీరోయిన్ గా నిలిచింది. ఈ సినిమాలో మరోసారి తన అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టింది. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా మరో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా కోసం తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారట. ఇంతకీ విజయ్ దేవరకొండ సపోర్టుగా నిలవడమేంటీ అనుకుంటున్నారా? అయితే.. ఆ విశేషాలు ఏంటో ఓ లూక్కెయ్యండి.

అల్లు అర్జున్- రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను సృష్టిస్తుంది. కేవలం 4రోజుల్లోనే 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ వచ్చిందో హీరోయిన్ రష్మిక మందానాకు కూడా అంతే క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో రష్మిక మందాన పాపులాటి మరింత పెరిగింది. అంతేకాకుండా రష్మిక మందాన తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుందనే చెప్పాలి.

Rashmika Girl Friend Teaser begins with Vijay Deverakonda poetic voiceover

రష్మిక తదుపరి సినిమా గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేషనల్ క్రష రష్మిక మందన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' (The Girlfriend). ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్‌ లుక్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే..

తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. విజయ్‌ దేవరకొండ కవితతో ప్రారంభమైంది. ఈ టీజర్ ప్రారంభం కాగానే.. 'నయనం నయనం కలిసే తరుణం.. యదనం తరిగి పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.. విసిరి నవ్వుల్లో వెలుగులు చూసా.. నీ నవ్వు ఆపితే చీకటి పగులును తెలుసా.. నీకై మనసును రాసి చేశా.. పడ్డానేమో ప్రేమల బహుశా.. అంటూ విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్ ను తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందాన సినిమా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇచ్చేశాడు. లాస్ట్ లో 'ఇదేదో పికప్ లైన్ కాదు కదా' అంటూ రష్మిక మందాన క్యూట్ డైలాగ్ వేస్తుంది. మొత్తానికి ఈ టీజర్ చాలా క్లాస్ గా ఉంది.

ఇదిలా ఉంటే.. రష్మిక మందాన సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు మీడియా కంటపడ్డారు. తాజాగా రష్మిక మందాన తమ రిలేషన్ గురించి ఓపెన్ అయిన విషయం కూడా తెలిసింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం కన్ఫర్మ్‌ అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. గర్ల్ ఫ్రెండ్ కోసం సపోర్ట్ గా నిలిచాడు, లవర్ కు అండగా నిలిచిన దేవరకొండ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X