అతనే నా అభిమాన హీరో.. డేట్‌కు వెళ్లే ఛాన్స్ వచ్చిందంటే అస్సలు వదులుకోను: రష్మిక మందన్న
ఛలో సినిమాతో వెండితెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న లక్కేమిటో గాని చాలా తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేస్తోంది. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక ఈ బ్యూటీ ఇటీవల డేట్ కు వెళ్లే అవకాశం వస్తే ఒక స్టార్ హీరోతో వెళతాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఆ సినిమా మన తెలుగు హీరోనే కావడం విశేషం.

ఆ సినిమాలతోనే..
కన్నడ ఇండస్ట్రీలో ఒకటి రెండు హిట్స్ అందుకోగానే రష్మికకు ఇతర ఇండస్ట్రీలో ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆమె రెమ్యునరేషన్ కు ఆశపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. ఛలో, గీత గోవిందం వంటి విభిన్నమైన సినిమాలు వెనువెంటనే హిట్టవ్వడంతో అమ్మడి రాత మారిపోయింది.

ఎంగేజ్మెంట్ తరువాత
ఇక ఆ మధ్య అమ్మడు కన్నడ యాక్షర్ రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న విషయం తెలిసిందే. 2017లో ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గానే జరిగింది. అయితే మధ్యలో ఏమయ్యిందో తెలియదు ఏమో గాని అమ్మడు బ్రేకప్ చెప్పేసి సినిమాలతో బిజీ అయ్యింది.

ప్రభాస్ తో మాత్రమే డేట్
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన క్రష్ హీరోపై కామెంట్ చేసింది. డేట్ కు వెళ్లే ఛాన్స్ వచ్చింది అంటే ఏ హీరోతో వెళతారు అనే ప్రశ్నకు.. అమ్మడు ప్రభాస్ అని సమాధానం ఇచ్చేసింది. అతనితో ఛాన్స్ వస్తే గనక తప్పకుండా ఒకరోజు డేట్ కు వెళతాను అని వివరణ ఇచ్చింది. ప్రభాస్ కు తాను అతిపెద్ద అభిమానిని కూడా రష్మిక తెలియజేసింది.
Recommended Video

సినిమాలతో బిజీబిజీగా
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే హిందీలో మిషిన్ మజ్ను అనే సినిమాతో పాటు 'గుడ్ బై' అనే కథలో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో అడళ్లు మీకు జోహార్లు అనే సినిమాకు కుడా గ్రీన్ ఇచ్చింది. మరి ఈ సినిమాలన్నీ ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











