రక్షిత్ శెట్టి, విజయ్ దేవరకొండలో ఎవరు బెస్ట్ అంటే.. రష్మిక
Recommended Video

కిరిక్ పార్టీతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టన రష్మిక మందన్న వరుస విజయాలను చేజిక్కించుకొంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా రష్మిక నటించిన గీతా గోవిందం భారీ విజయం వైపు పరుగులు పెడుతున్నది. ఆమె నటించిన ఐదు సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. తాను నటించిన చిత్రాల్లోని హీరోలు నాకు కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, సూచనలను, సలహాలను అందించారని రష్మిక వెల్లడించింది. ఇంకా ఆమె ఏమన్నారంటే..

ఐదుగురితో నటించా
నా కెరీర్‌లో ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాలు కేవలం ఐదే. ఐదు చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి. నేను రక్షిత్ శెట్టి, పునీత్ రాజ్ కుమార్, గణేష్, నాగశౌర్య, విజయ్ దేవరకొండతో నటించాను. తదుపరి చిత్రంలో నానితో నటిస్తున్నాను.

ఎవరు బెస్ట్ అంటే
ఐదుగురు హీరోలలో నాకు నచ్చిన హీరో ఎవరని అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కరితో ఒకరకమైన రిలేషన్స్ ఉన్నాయి. వారి వద్ద నుంచి చాలా నేర్చుకొన్నాను. ఏ ఒక్కరో బెస్ట్ అని చెప్పలేను. ఎందుకంటే నా కెరీర్ ఇలా ఉండటానికి వారు సహకారం ఎంతో ఉంది.

ఎవరో ఒకరు ఏదో అంటారు
నా నటన గురించి నేను నా చుట్టు ఉండేవాళ్లను అడిగి తెలుసుకొంటాను. సోషల్ మీడియాలో చేసే కామెంట్లను నేను పట్టించుకోను. నా చుట్టు ఉండే వాళ్లతో సంతోషంగా ఉండటం, వారిని ఆనందంగా ఉంచడం నాకు ఇష్టం. వినోద రంగంలో ఉన్నప్పుడు ఎవరో ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. వాటికి పరిగణనలోకి తీసుకొను అని రష్మిక చెప్పారు.

డియర్ కామ్రేడ్‌లో
గీత గోవిందం చిత్రంలో మేకప్ నాకు సూట్ కాలేదు. నాకు మేకప్ వేయడం నాకు నచ్చదు. నేను మేకప్ వేసుకోవద్దనే అనుకొంటాను. కానీ సెట్లో ఆ విషయం నా పరిధిలో ఉండదు. లక్కీగా డియర్ కామ్రేడ్‌లో మేకప్ వేసుకొనే అవకాశం లేకపోయింది.

సినిమాకు ముందు హోంవర్క్
ఏ సినిమాను అంగీకరిస్తే దాని కోసం, ఆ చిత్రంలోని పాత్ర కోసం హోంవర్క్ చేస్తాను. పరభాషా చిత్రమైతే భాష గురించి ఆలోచిస్తాను. కెమెరా ముందు ఏ యాంగిల్‌లో నిలబడితే అందంగా కనిపిస్తాను అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటాను. నేను ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నాను.


Click it and Unblock the Notifications











