విజయ్‌తో అనగానే అమ్మానాన్న వద్దన్నారు.. అతడి కోసం ఎన్నో దాటుకుని వచ్చా: రష్మిక

Recommended Video

Rashmika Mandanna Speech - Dear Comrade Pre Release Event

రష్మిక మందన్నా.. అందం, అభినయంతో రాణిస్తున్న హీరోయిన్. సైలెంటుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'గీత గోవిందం' త‌ర్వాత ఈమె న‌టించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తోనే నెల రోజులుగా బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జులై 26న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో 'డియర్ కామ్రేడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా రష్మిక ఎన్నో విషయాలు పంచుకుంది.

ఫైట్ చేయాలి

ఈ ఫంక్షన్‌లో రష్మిక ఫైట్ అనే కాన్సెప్ట్ గురించి ముందుగా మాట్లాడింది. ఆ సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున గోల చేశారు. దీంతో రష్మిక ‘‘మీతో మాట్లాడాలంటే కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. మీరు వినాలంటే నేను ఫైట్ చేయాలి. అసలు ఫైట్ అంటే ఒకరిని కొట్టడం కాదు.. నువ్వు నీ శరీరంతో ఫైట్ చేయాలి.. నువ్వు నీ వ్యక్తిత్వంతో ఫైట్ చేయాలి.. నువ్వు నీ పరిసరాలతో ఫైట్ చేయాలి. అన్ని చేశాకే ఇక్కడకు రావాలి'' అంటూ చెప్పుకొచ్చింది.

అందరితో ఫైట్ చేసి వచ్చా

అందరితో ఫైట్ చేసి వచ్చా

ఈ సందర్భంగా తన లైఫ్ గురించి రష్మిక రెండు విషయాలు చెప్పింది. ‘‘నేను ఇండస్ట్రీకి రావాలంటే.. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో ఫైట్ చేసి వచ్చా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లకు. అది అంత మంచిది కాదు.. ముఖ్యంగా అమ్మాయిలకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అని చెప్పారు. కానీ, వచ్చా'' అని రష్మిక తెలిపింది.

విజయ్ కోసం ఫైట్ చేశా

విజయ్ కోసం ఫైట్ చేశా

ఈ సినిమా కథ నచ్చడంతో తన అమ్మానాన్నతో ఫైట్ చేశానన్న రష్మిక.. ‘‘ఈ స్క్రిప్ట్ నాకెంతగానో నచ్చింది. అప్పుడే ఇది ఎలాగైనా చేయాలి అనుకున్నా. కానీ, అమ్మానాన్నను ఒప్పించడానికి ఫైట్ చేశా. ఇది మా ఇంట్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈ సినిమా చేయొద్దన్నారు. ఎందుకు విజయ్‌తో ఇంకో సినిమా చేస్తున్నావ్..? వద్దు చేయొద్దన్నారు'' అని రష్మిక వెల్లడించింది.

క్రికెట్ వల్ల ఎన్నో ఇబ్బందులు

క్రికెట్ వల్ల ఎన్నో ఇబ్బందులు

ఈ సినిమాలో రష్మిక క్రికెట్ ప్లేయర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ‘‘ముందు నుంచీ చెబుతూనే ఉన్నా. నాలుగు నెలలు క్రికెట్ ప్రాక్టీస్ చేశాను. ఈ నాలుగైదు నెలల్లో నా శరీరం మొత్తం మారిపోయింది. నా భుజం తప్పుకుంది. నా కాలు బెనికింది. ఆ సమయంలో నేను నా బాడీతో ఫైట్ చేశా'' అని ఆమె వివరించింది.

బ్లెడీ అమేజింగ్ యాక్టర్‌తో చేస్తున్నా

బ్లెడీ అమేజింగ్ యాక్టర్‌తో చేస్తున్నా

ఈ సినిమాలో ఏం చేయాలన్నా ఫైట్ చేశానని చెప్పిన రష్మిక.. విజయ్ గురించి మాట్లాడింది. ‘‘నేను బ్లెడీ అమేజింగ్ యాక్టర్‌తో చేస్తున్నా అని అనిపించినప్పుడల్లా ఇంకొంచెం కష్టపడాలని అనిపించింది. అతడు సినిమా కోసం ఏం చేస్తాడో.. ఎలా కష్ట పడతాడో చూశాక.. విజయ్‌పై గౌరవం పెరిగింది. అతడు నాకు ఫ్రెండ్ అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది'' అని ఆమె చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X