twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మిక స్పెషల్ ట్రైనింగ్.. ప్రియమైన కామేడ్ర్‌ కోసం తెలంగాణ పిల్లగా..

    By Rajababu
    |

    పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, మహానటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నాడు విజయ్ దేవరకొండ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా దక్షిణాది భాషల్లో నటిస్తూ నటుడిగా తన పరిధిని పెంచుకొంటున్నాడు. ఆయన నటించిన టాక్సీ‌వాలా చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

     మైత్రీ మూవీస్‌లో డియర్ కామ్రేడ్

    మైత్రీ మూవీస్‌లో డియర్ కామ్రేడ్

    మే 9వ తేదీన విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా విజయ్ దేవరకొండ నటించనున్న డియర్ కామ్రేడ్ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం గురించి ఇటీవల విజయ్ స్పందిస్తూ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ రూపొందిస్తున్నారు.

     భరత్ కమ్మ దర్శకత్వం

    భరత్ కమ్మ దర్శకత్వం

    యాక్షన్ డ్రామాగా రూపొందే ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జూన్‌లో మొదలవుతుంది అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో కన్నడ నటి, చలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నది.

    డియర్ కామ్రేడ్‌‌లో రష్మిక

    డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక మందన ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రికెటర్‌గా రష్మిక కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ క్రికెట్ క్లబ్‌లో ప్రత్యేక క్రికెట్ పాఠాలు నేర్చుకొంటున్నారట. ప్రస్తుతం ఓ కోచ్ ఆమెకు శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.

     ఆ చిత్రానికి సంబంధం లేదు

    ఆ చిత్రానికి సంబంధం లేదు

    డియర్ కామ్రేడ్ చిత్రంలో కమ్యూనిస్టు ఫ్యామిలికి చెందిన స్టూడెంట్ లీడర్‌ పాత్రను విజయ్ దేవరకొండ పోషించనున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన కామ్రెడ్ ఇన్ అమెరికా ఆకా సీఐఏ అనే చిత్ర నుంచి స్ఫూర్తి పొంది నిర్మిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల ప్రెస్ మీట్‌లో అందులో వాస్తవం లేదని వెల్లడించారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటిస్తున్న డియర్ కామ్రేడ్‌కు మలయాళం చిత్రానికి సంబంధం లేదు అని చిత్ర దర్శకుడు భరత్ కమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.

    English summary
    Actress Rashmika Mandanna, who made her debut this year with Telugu film Chalo, will share the screen space with Vijay Deverakonda in Dear Comrade. As per the reports, Vijay will essay the character of a student leader from a communist family, while Rashmika will be seen as a cricketer playing for Telangana state. As a part of the preparation, the actress is currently taking some cricket lessons in the cricket club in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X