For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  |

  సాధారణంగా సినీ రంగంలో నటీనటుల మధ్య ప్రేమాయణాలు సాగుతున్నాయని తరచూ ఏవో వార్తలు వస్తూనే ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఇలా ఎంతో మంది మధ్య బంధం ఉన్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవి ఇంకాస్తా ఎక్కువ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్యన కూడా లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి పెళ్లి ఫొటో వైరల్‌గా మారింది. దాన్ని మీరు కూడా చేసేయండి!

  అలా పరిచయం.. స్టార్లుగా ఎదిగి

  అలా పరిచయం.. స్టార్లుగా ఎదిగి

  కన్నడ మూవీ 'కిర్రాక్ పార్టీ'తో రష్మిక మందన్నా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిపోయింది. అలాగే, విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా వచ్చాడు. అతడు కూడా కొన్ని సినిమాలే చేసి స్టార్‌గా ఎదిగాడు. దీంతో ఇద్దరూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నారు.

  Bigg Boss Nominations: ఆరో వారం నామినేషన్స్ లీక్.. ముఖంపై కొట్టి మరీ.. మళ్లీ 8 మంది నామినేట్

  రష్మిక కెరీర్ అలా.. విజయ్‌ ఇలా

  రష్మిక కెరీర్ అలా.. విజయ్‌ ఇలా


  రష్మిక మందన్నా ఇప్పుడు దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది. ఇప్పుడామె 'పుష్ప 2'తో పాటు బాలీవుడ్ చిత్రాలు 'మిషన్ మజ్నూ', 'యానిమల్' చిత్రాల్లో నటిస్తోంది. ఇక, విజయ్ దేవరకొండ ఇటీవలే 'లైగర్' అన పాన్ ఇండియా మూవీతో వచ్చాడు. ఇది డిజాస్టర్ అయింది. ఇప్పుడతను 'ఖుషి' అనే సినిమాలో మాత్రమే నటిస్తున్నాడు.

  నిశ్చితార్థం క్యాన్సిల్.. విజయ్‌తో

  నిశ్చితార్థం క్యాన్సిల్.. విజయ్‌తో

  రష్మిక మందన్నా సినిమా కెరీర్‌ను మొదలు పెట్టిన తొలినాళ్లలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ వెంటనే అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, అర్థాంతరంగా ఈ బంధానికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  విజయ్.. రష్మిక పెళ్లి అంటూనే

  విజయ్.. రష్మిక పెళ్లి అంటూనే

  రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ చిన్నది తరచూ విజయ్ ఇంట్లో కనిపిస్తుంటుంది. దీంతో వీళ్ల పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

  ఎయిర్‌పోర్టులో... జంటగా టూర్

  ఎయిర్‌పోర్టులో... జంటగా టూర్

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్నా పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరూ మాల్దీవులు టూర్ వెళ్లారు. అలాగే, తాజాగా ఇప్పుడు మరోసారి జంటగా అక్కడికి చెక్కేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో కనిపించడమే అని తెలుస్తోంది.

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  రహస్యంగా రష్మిక, విజయ్ పెళ్లి

  రహస్యంగా రష్మిక, విజయ్ పెళ్లి

  తమ మధ్య ఉన్న బంధం గురించి ఓపెన్ అవకపోయినా.. అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్నా తరచూ కలిసే కనిపిస్తున్నారు. అలాగే, ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా హాజరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా మాల్దీవుల్లో జంటగా ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది.

  మామూలు క్రియేటివిటీ కాదుగా

  మామూలు క్రియేటివిటీ కాదుగా

  టెక్నాలజీ సహాయంతో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఫొటోను మార్ఫింగ్ చేశారు. ఇందులో వేరే వాళ్ల బాడీలకు వీళ్లిద్దరి ముఖాలను పెట్టారు. ఇది గమనించని వాళ్లు నిజంగానే రష్మిక, విజయ్ పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఎంతకు తెగించార్రా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు.

  English summary
  Rashmika Mandanna and Vijay Devarakonda Dating News Gone Be Hot Topic in Industry. Now Their Marriage Morphing Pic Goes Viral in Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X