»   » రాక్‌స్టార్‌కు ఫోజులెక్కువ.. నోరు జారిన రష్మిక మందన.. దుమ్ము దులిపిన ఫ్యాన్స్..

రాక్‌స్టార్‌కు ఫోజులెక్కువ.. నోరు జారిన రష్మిక మందన.. దుమ్ము దులిపిన ఫ్యాన్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొందరికి నోటి దురుసు ఎక్కువగా ఉంటుంది. పని పక్కన పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లేడేస్తుంటారు. ఇలాంటివి రోజువారీ జీవితంలో కామన్. కానీ ప్రముఖుల నుంచి అలాంటి మాటలు వస్తే మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. కిరిక్ పార్టీ అనే చిత్రంతో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన ఇటీవల తోటి హీరోపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి నాలిక కొరుక్కొన్నది. తీరా సదరు హీరో అభిమానులు సోషల్ మీడియాలో చెంపలు వాయించడంతో తప్పైంది మహాప్రభో అంటో కాళ్లావేళ్లా పడింది. అసలు ఏం జరిగిందంటే..

ఎవరు ఫోజులు కొడుతారంటే..

ఎవరు ఫోజులు కొడుతారంటే..

కన్నడలో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రాల్లో కిరిక్ పార్టీ ఒకటి. ఆ చిత్రంలో శాన్వీ అనే పాత్రను పోషించిన కన్నడ భామ రష్మిక‌తో మీడియా చిట్‌చాట్ నిర్వహించింది. కన్నడ సీమలో హీరోలపై తనకు ఉన్న అభిప్రాయాలను వెల్లడించాలని రష్మిక కోరింది. గొప్పలు కొట్టే.. ఫోజులు కొట్టే హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రష్మిక వివాదంలో కూరుకుపోయింది. తోటి నటుడిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తావా అంటూ ఫ్యాన్స్ కసురుకున్నారు.

యష్ ఎక్కువ ఫొజులు కొడుతాడు..

యష్ ఎక్కువ ఫొజులు కొడుతాడు..

ఫోజులు ఎక్కువగా కొట్టే నటుల్లో రాక్‌స్టార్ యష్ ముందుంటాడు అని రష్మిక మందన తన అభిప్రాయాన్ని తెలిపింది. అక్కడే ఆమె చిక్కుల్లో పడింది. ఏంటీ మా హీరోను అలా అంటావా? నీ తాట తీస్తాం అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దుమ్ము దులిపారు. దాంతో అందాల భామ కంగుతిన్నది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ముద్దుగమ్మ చేసేదేమీ లేక క్షమాపణలు చెప్పింది. అప్పటికే అభిమానుల వాయించిన వాయింపులకు అమ్మడి బుగ్గలు ఎర్రబారాయి.

ముందు నేను నిరాకరించా

ముందు నేను నిరాకరించా

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఫోజులు, గొప్పలకు పోయే హీరో ఎవరనే ప్రశ్నను మీడియా అడిగింది. అయితే నేను చెప్పడానికి, ఆ ప్రశ్నను దాటవేయడానికి నిరాకరించాను. అయితే బలవంతం చేయడంతో యష్ పేరు చెప్పాను. అది ఇంత పెద్ద వివాదంగా మారుతుందని నేను అనుకోలేదు అని రష్మిక అన్నారు.

క్షమాపణ చెప్తున్నా..

క్షమాపణ చెప్తున్నా..

ఒకవేళ ఎవరైనా నా వ్యాఖ్యలతో ఇబ్బంది పడినా.. ఎవరి మనోభావాలను దెబ్బ తీసినా గానీ అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని రష్మిక ఓ ప్రకటనను జారీ చేసింది. ఆ ప్రకటనను సోషల్ మీడియాలోనూ, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కేవలం వినోదం కోసం చేసిన ఇంటర్వ్యూ మాత్రమే.. దానిని సీరియస్‌గా తీసుకోవద్దని యష్ ఫ్యాన్స్‌ను కోరింది.

రష్మికను వదిలేయండి..

రష్మికను వదిలేయండి..

ఈ వివాదం ముదిరిపోతున్నదని గ్రహించిన హీరో యష్ కూడా రంగంలోకి దిగాడు. రష్మిక తనపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు. కావున ఆమెను ఈ వివాదం నుంచి విముక్తి చేయాలని తన ఫ్యాన్స్‌ను యష్ కోరాడు. రష్మిక, నేను మంచి స్నేహితులం. మా మధ్య ఎలాంటి గొడవలు, అభిప్రాయ భేదాలు లేవు అని ఆయన వివరణ ఇచ్చారు.

English summary
The young lady tried to evade the question but later named Rocking Star Yash. Fans of the Kannada heartthrob did not take lightly to this ‘insult’ to their charming and humble star. They began trolling Rashmika on social media. Rashmika later took to Facebook to apologise if she had hurt any sentiments by her statement.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu