రష్మిక ‘రేంజ్’కు తగ్గట్టుగానే ఉంది.. కొత్త కారుతో కన్నడ బ్యూటీ సందడి!!
రష్మిక మందాన్న కోసం మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. రష్మిక ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో రష్మిక ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారింది. అందుకే శర్వానంద్ సినిమాకు అడిగినంత మొత్తం విని అందరూ షాక్ అయ్యారట. రష్మిక చేతుల్లోకి స్టార్ హీరోల ప్రాజెక్ట్‌లు వెళ్తున్నా కూడా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుందట.

ఫుల్ డిమాండ్..
రష్మిక మందాన్న 2020 బాగానే కలిసి వచ్చింది. ఆమె నటించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. జనవరి నెలలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసింది. ఫిబ్రవరిలో భీష్మ సినిమాతో రచ్చ చేసింది. ఇలా రెండు చిత్రాలతో 2020లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా మారింది.

కోలీవుడ్‌లోనూ..
రష్మికకు ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లొనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ కార్తీ హీరోగా సుల్తాన్ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో చిత్రం కూడా రెడీగా ఉందట. అలా కోలీవుడ్, శాండల్ వుడ్, టాలీవుడ్‌లొ పాగా వేసిన రష్మిక బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్దమైంది. సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి రష్మిక నటించబోతోంది.

బయటకు చెప్పను..
ఇక రష్మిక జోరు ఇలా ఉంటే ఆమె కారు కొనుక్కోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ మేరకు తన కారుకు సంబంధించి వివరాలు చెబుతూ.. మామూలుగా ఇలాంటివన్నీ నాతోనే పర్సనల్‌గా ఉంచుకుంటాను. బయటకు చెప్పనంటూ ఓ పోస్ట్ చేసింది.

మీరంతా ఓ భాగమే..
ఈ సారి మాత్రం మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలో మీరంతా ఓ భాగమే.. దీనతంటికి కారణం మీరే.. అందుకే మీతో చెబుతున్నాను. మీకు ఈ విషయం తెలియాలని చెబుతున్నాను. గతంలో నేను ఎప్పుడూ కూడా ఇలా ఊహించలేదు.. ఇలాంటివి వస్తాయని అనుకోలేదంటూ రష్మిక ఎమోషనల్ అయింది.

తగిన ప్రతిఫలం..
ఇలా ఎయిర్ పోర్ట్‌కు వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు.. అలా వెళ్తున్న ఈ గ్యాప్‌లో దొరికిన రెండు నిమిషాల్లో మీకు ఇది చెప్పాలని ఫోటోను తీసుకున్నాను. ఈ ప్రయాణంలో నాతో పాటు భాగస్వామ్యులు అయినందుకు, నా మీద ప్రేమను కురిపించినందుకు థ్యాంక్స్.. నేను కష్టపడ్డ వాటికి తగిన ప్రతిఫలం ఇచ్చినందుకు థ్యాంక్స్. మనందరం ఇందులో ఉండాలి.. అదే నాకు నిజమైన ఆనందం. ఐ లవ్యూ అంటూ తన అభిమానులకు కొత్త కారును చూపించింది.


Click it and Unblock the Notifications











