Rashmika Mandanna: సస్పెన్స్ వీడింది.. బాయ్ ఫ్రెండ్ వివరాలు బయట పెట్టిన రష్మిక మందన్నా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ కొట్టిసిన ఈ భామ.. ఇటీవల యానిమల్ సినిమాతో మరోసారి ఇండియా వైడ్ గా అలరించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండును పరిచయం చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోను పంచుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా.. కిర్రాక్ పార్టీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఈ బ్యూటీ... ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన వీరి ప్రేమ... పెళ్లి పీటలు ఎక్కకముందే బ్రేకప్ అయింది. అయితే కన్నడం నుంచి తెలుగు సినిమాలకు షిప్ట్ అయిన రష్మిక.. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. చలోతో ఎంట్రీ ఇచ్చి.. తన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వేసుకుంది.

ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టిసిన ఈ భామ.. ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. రణబీర్ కపూర్ హీరోగా నటించారు. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక గీతాంజలి అనే పాత్రలో ప్రేక్షకులను అలరించింది.
ఇక యానిమల్ కంప్లీట్ కాగానే మళ్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయి.. తన సినిమాల్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ వివరాలు బయటపెట్టింది రష్మిక. రష్మికకు బాయ్ ఫ్రెండా అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇది సినిమాలోనే భాగంగానే. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా లేడీ ఒరియెంటెడ్ గా తెరకెక్కుతుండగా.. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండుగా ఓ హీరో నటించనున్నారు.

ఆ హీరో ఎవరో కాదు.. దసరా సినిమాలో నాని ఫ్రెండుగా నటించిన దీక్షిత్ శెట్టి. ఈ కుర్ర హీరో.. దసరాలో నటించి.. అమ్మాయిలకు తెగ నచ్చేశాడు. ఇప్పుడు ఈ హీరో రష్మిక బాయ్ ఫ్రెండుగా ది గర్ల్ ఫ్రెండు మూవీలో నటించనున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మేకర్స్ గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ ఇతనే అంటూ తెలిపారు. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అతనికి బర్త్ డే విషెస్ తెలిపారు.
ఇక వీడియోలో విక్రమ్ గురించి రష్మిక తన మాటల్లో చెప్తుండగా.. ఇంకో పక్క అగ్రెసివ్ గా ఉన్న విక్రమ్ ను చూపించారు మేకర్స్. ఇక ఈ సినిమాకు రాహుల్ రవింద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది ఈ మూవీ. ప్రస్తుతం రష్మిక బాయ్ ఫ్రెండ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











