Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రష్మికను బతకనివ్వండి, ఏదో ఊహించుకోవద్దు, కారణాలు చెప్తా.. బ్రేకప్‌పై రక్షిత్ గుండె తరుక్కుపోయేలా లేఖ
కన్నడ తారలు రష్మిక మందన్న, రక్షిత్ నిశ్చితార్థం రద్దుపై క్లారిటీ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల వారికి చెందిన ఇరు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. రష్మిక, రక్షిత్ కుటుంబాల సమ్మతంతోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎలాంటి వివాదం లేకుండా ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో రష్మికపై వస్తున్న రూమర్లకు చెక్ చెబుతూ ఆమెకు రక్షిత్ అండగా నిలువడం గమనార్హం. బ్రేక్ వార్తలను ధృవీకరిస్తూ ఉద్వేగభరితమైన లేఖను ఫేష్‌బుక్‌లో పోస్టు చేశారు.
సోషల్ మీడియాకు దూరంగా
నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ముందుగా ప్రకటించాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వివరణ ఇవ్వడానికి ఫేస్‌బుక్‌ను ఎంచుకొన్నాను. నిశ్చితార్థం క్యాన్సిల్ కావడంతో గత కొద్దిరోజులుగా జీవితంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి అని రక్షిత్ పేర్కొన్నారు.
ఎవరి ప్రేమకైతో పరితపించానో
ఎవరి ప్రేమకోసమైతే తపించానో, ఎవరి కోసమైతే బతికానో వారు దూరమైనప్పుడు ఎంత బాధ ఉంటుదో మాటల్లో చెప్పలేం. ఈ వ్యవహారంలో రష్మిక గురించి తప్పుడు అభిప్రాయాలను ఏర్పరుచుకోవద్దు. బయట మాట్లాడుకొంటున్న తీరును నేను తప్పు పట్టాలనే ఉద్దేశం లేదు. మేము చెప్పేది, మాకు తెలిసింది మీరు కూడా నమ్మాలని కోరుకొంటున్నాం అని రక్షిత్ ఉద్వేగంగా పేర్కొన్నారు.
రష్మికతో బ్రేకప్‌కు
రష్మికతో బ్రేకప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏదో కారణాన్ని ఊహించుకొని రష్మికపై ఓ అభిప్రాయానికి రావొద్దు. ఆమె ప్రశాంతంగా బ్రతకనివ్వండి. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. నిజమేంటో తెలుస్తుంది అని రక్షిత్ తెలిపారు.
మీడియాను వార్తలను నమ్మకండి
రష్మిక, నా బ్రేకప్ వ్యవహారంలో మీడియా ప్రసారం చేసే కథనాలను, లేదా వార్తలను నమ్మకండి. ఈ వ్యవహారంలో చోటుచేసుకొన్న అసలు విషయాలు ఎవరికి తెలియవు. కొన్ని మీడియా సంస్థలు వారికి తోచింది ఏదో ఊహించుకొని ఏదో ఏదో రాసేస్తున్నాయి. కల్పిత వార్తలు వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఉండవు.
Recommended Video
నా బాధ అర్థం కావడానికి
నా బాధ, ఈ విషయం అందరికీ అర్ధం కావడానికి నా ఫేస్బుక్ అకౌంట్‌ను మరికొన్ని రోజులు లైవ్‌లో ఉంచుతాను. వాస్తవం చెప్పాల్సిన ప్రతీసారి నేను సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తాను. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి, బ్రేకప్‌కు సంబంధం లేదు. సోషల్ మీడియా వ్యసనంగా మారిన క్రమంలో నా పనిపై నేను దృష్టిపెట్టలేకపోతున్నాను. అందుకే దూరంగా ఉండాలని కోరుకొన్నాను అని రక్షిత్ చెప్పాడు.
రష్మిక తల్లి క్లారిటీ
రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి ముగింపు పలికేందుకు వారి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. రష్మిక తల్లి సుమన్ మందన్న నిశ్చితార్థం బ్రేకప్ జరిగిన విషయం నిజమే. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాం అని ఆమె వెల్లడించడం తెలిసిందే.