మహేష్ బాబును ఎంతో విసిగించా.. ఆయన ఎలా ఫీల్ అయ్యారంటే!: రష్మిక మందన్న
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న మహేషబాబును తెగ విసిగించానని అంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన 'సరిలేరు నీకెవ్వరు' తాను తెగ అల్లరి చేసేదాన్ని అని చెబుతోంది. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక స్వయంగా ఈ విషయాలు తెలిపింది.
సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది సరిలేరు నీకెవ్వరు మూవీ. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌పై బజ్ నెలకొంది. ఇక ఇటీవలే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్, విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి.
ఈ పరిస్థితుల నడుమ మీడియాతో ముచ్చటించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ రష్మిక మందన్న. ఈ సందర్బంగా షూటింగ్‌కి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. సెట్స్‌పై మహేష్ బాబును తాను ఎంతగానో విసిగించేదాన్నని రష్మిక చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆయన అస్సలు ఫీల్ కాకాపోగా.. పైగా 'పోనీలే చిన్న పిల్ల.. ఏదో అల్లరి చేస్తోంది' అని వెనకేసుకు వచ్చేవారని తెలిపింది.

అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ.. ఆయనకు 10/10 మార్కులు ఇస్తానని రష్మిక చెప్పింది. ప్రతీ సన్నివేశాన్ని దగ్గరుండి చేసి చూపిస్తూ అనిల్ రావిపూడి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారని ఆమె పేర్కొంది. ఇంకా రష్మిక ఏమేమి విషయాలు చెప్పిందో క్రింది వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











