రష్మిక మందన్న సడెన్ ఎంట్రీ.. ఆడియన్స్ రియాక్షన్.. చివరకు 'సరిలేరు నీకెవ్వరు'!

విడుదల రోజే సినిమా చూడటమంటేనే ఓ కిక్కు. అలాంటిది ఆ సినిమా హీరోయిన్‌తో అలా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే ఆ కిక్కు మారేలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్నారు హైదరాబాదీ ప్రేక్షకులు. సిటీలోని ఓ థియేటర్‌లో సడెన్ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న. కాకపోతే ఆమె ఎంట్రీ కొందరు అభిమానులకు నిరాశ కలిగించింది. వినడానికి విడ్డురంగా ఉంది కదూ! ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తుంది.

మహేష్ బాబు జోడీగా రష్మిక మందన్న

మహేష్ బాబు జోడీగా రష్మిక మందన్న

సూపర్‌ స్టార్ మహేష్ బాబు జోడీగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించింది రష్మిక మందన్న. భారీ అంచనాల నడుమ శనివారం (జనవరి 11) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో థియేటర్స్ అన్నీ అభిమానుల కోలాహలంతో పోటెత్తాయి.

మాటిచ్చిన రష్మిక.. అందరి మధ్య అలా

మాటిచ్చిన రష్మిక.. అందరి మధ్య అలా

గతంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతో కలిసి ఈ సినిమా చూస్తానని మాటిచ్చింది రష్మిక మందన్న. ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు ఉదయం హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ వెళ్లి అందరి మధ్య సినిమా చూసింది.

రష్మికతో సెల్ఫీ.. సందడే సందడి


శ్రీరాములు థియేటర్‌లో రష్మిక సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. రష్మిక థియేటర్‌కు రావటం గమనించిన అభిమానులు పెద్దఎత్తున జై మహేష్ బాబు, జై రష్మిక అంటూ నినాదాలు చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. దీంతో థియేటర్ ప్రాంగణమంతా సందడి సందడిగా మారింది.

అభిమానుల తాకిడి.. పోలీస్ కంట్రోల్

అభిమానుల తాకిడి.. పోలీస్ కంట్రోల్

రష్మిక మందన్నను చూడగానే ఆమెను జనం చుట్టుముట్టటంతో.. కొద్దిసేపు గందరగోళ వాతావరణం కనిపించింది. ఒకదశలో ప్రేక్షకులు, అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ఇబ్బందికరంగా మారింది. చివరకు ఆమెను థియేటర్ లోకి పంపించి అభిమానుల మధ్య కూర్చోబెట్టారు.

Recommended Video

Sarileru Neekevvaru Movie Twitter Review
అభిమానుల నిరాశ.. కారణమిదే!

అభిమానుల నిరాశ.. కారణమిదే!

ఈ కారణంగా షో వేయడం కాస్త ఆలస్యమైంది. అభిమానులను అదుపు చేసి, తిరిగి షో ప్రారంభించే సరికి కాస్త ఆలస్యమైంది. అయితే ఇలా షో ఆలస్యం కావటం పట్ల కొందరు ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ముందుగానే ఇలాంటి వాటి పట్ల చర్యలు తీసుకొని షో అనుకున్న సమయానికే పడేలా చూడాలే తప్ప ఇలా లేట్ చేయడం సరికాదని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X