Rakshit Shetty: పెళ్లిపై రష్మిక మాజీ ప్రియుడు క్లారిటీ... ఆ లక్కీ అమ్మాయి ఎవరంటే?
రష్మిక మందన్నా మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి గురించి అందరకీ తెలిసిందే. ఆయన నటించిన తాజా కన్నడ చిత్రం సప్త సాగర దాచే ఎల్లో. ఇక ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రక్షిత్ శెట్టి పలు ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఆయన పెళ్లిపై స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే....
ఇటీవల తెలుగులో కన్నడ సినిమాలు బాగా ఆడుతున్నాయి. కేజీఎఫ్ సీరిస్ నుంచి ప్రారంభం అయిన కన్నడ సినిమాలు... ఇటీవల వచ్చిన బాయ్స్ హాస్టల్ చిత్రం సైతం ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కన్నడ చిత్రం తెలుగులోకి రాబోతుంది. కన్నడంలో సూపర్ హిట్టుగా నిలిచిన సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఇప్పుడు తెలుగులోకి సప్త సాగారాలు దాటి అనే పేరుతో రాబోతుంది.

రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి చిత్రం తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి. గుండెల్ని పిండేసే ప్రేమకథ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు.రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
ఆ రెండు సినిమాలు తెలుగులో బాగా ఆడాయి. అంతే కాదు రక్షిత్ యాక్టింగ్ మనవాళ్లు ఫిదా అయిపోయారు. సెప్టెంబర్ 1న కన్నడంలో రిలీజైన సప్త సాగర దాచే ఎల్లో సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 22వ తేదీన తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కానుంది.

రక్షిత్ శెట్టి నటించిన ఈ సప్త సాగర దాచే ఎల్లో మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులోకి రిలీజ్ చేస్తుంది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించాగ... ఈ సినిమాకు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో... ఈ మూవీ ప్రమోషన్స్ లో రక్షిత్ శెట్టి పాల్గొన్నాడు.
తెలుగు ఫిల్మీ బీట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పెళ్లి గురించి చెప్పుకువచ్చాడు. పెళ్లి ఎప్పుడు అనగానే సిగ్గుపడుతూ... త్వరలోనే అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ అమ్మాయి వివరాలు కూడా త్వరలో చెప్పనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సప్త సాగారాలు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రేమకథా చిత్రం. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. మొదటి భాగం రిలీజ్ అయి సూపర్ హిట్టు కాగా.. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రెండో భాగం అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఇక రక్షిత్ శెట్టి గతంలో రష్మిక మందన్నాను ప్రేమించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా పోయింది. ఎందరో సెలబ్రెటీల మధ్య వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. మరి ఏమైందో తెలియదు కానీ... వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇరువురు ఎవరి లైఫ్ ల్లో వారు బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











