For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    గుండెపోటు తెప్పించారు.. ఏం చేశారో మీకేమైనా అర్థం అవుతుందా? విజయ్ దేవరకొండపై రష్మిక సీరియస్

    |

    అందాల తార రష్మిక మందన్న ఏప్రిల్ 5వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు, ఫొటోలు, వీడియోలతో రకరకాలుగా విషెస్ తెలియజేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఆమెకు ఒకింత కోపం, నవ్వును తెప్పించాయి. దాంతో కొంత అసహనంగానే రష్మిక స్పందించారు. అసలు ఏమైందంటే..

     డియర్ కామ్రేడ్ టీజర్‌తో పేరడి

    డియర్ కామ్రేడ్ టీజర్‌తో పేరడి

    రష్మికకు హ్యాపీ బర్త్ డే లిల్లీ అంటూ విజయ్ దేవరకొండ విషెస్ తెలియజేస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో డియర్ కామ్రేడ్ టీజర్‌ను అనుకరిస్తూ ఇద్దరు యువకులు కనిపించారు. విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకొన్న మాదిరిగానే ఓ యువకుడు వీడియోను మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో వదిలాడు. అదే వీడియోను రష్మిక బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు.

    ఘాటుగా స్పందించిన రష్మిక

    దాంతో రష్మిక మందన్న ఘాటుగా స్పందించింది. అబ్బాయిలు మీరేం అనుకొంటున్నారు. మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా? నా ఫ్యాన్స్‌కు గుండెపోటు తెప్పించినంత పనిచేశారు. అయ్యో జీసస్.. భరత కమ్మ.. మీరు చేసిన పనితో జీర్ణించుకోలేకపోతున్నాను అని రష్మిక ట్వీట్ చేశారు.

    రష్మిక అప్‌సెట్ కావొద్దు అని

    రష్మిక మందన్న గరం అయిందనే భావించిన విజయ్ దేవరకొండ మరో ట్వీట్ చేశాడు. ఏదో నిన్ను ఏడిపించేందుకు చేశాం. అప్‌సెట్ అవ్వకు. మా సెట్లో నీవు హ్యాపీగా ఉంటేనే మాకు ఆనందం. నీ ఫెర్ఫార్మెన్స్‌తో కంటతడి పెట్టించావు. నవ్వులతోనూ ముంచెత్తావు అని విజయ్ దేవరకొండ అన్నారు. మరోసారి హ్యపీ బర్త్ డే లిల్లీ.. 8వ తేదీన 11.11 గంటలకు నీకు తొలిపాటను డెడికేట్ చేస్తున్నాం అని ట్వీట్‌లో తెలిపారు.

    డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మికతో..

    డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మికతో..

    కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం మే 31న రిలీజ్ అవుతున్నది. రష్మిక కెరీర్ పరంగా చూస్తే.. ఆమె కన్నడలో గణేష్ సరసన యజమాన చిత్రంలో నటిస్తున్నది. కార్తీ చిత్రం ద్వారా ఆమె తమిళంలోకి కూడా ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Rashmika’s Dear Comrade co-star took to Twitter to send out a rather quirky birthday wish which has set Twitter on fire. The handsome hunk decided to have some fun on her birthday by sharing a fan edit of the Dear Comrade teaser. The hilarious video sees fans recreate the original video and it is bound to leave you in splits.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more