Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గుండెపోటు తెప్పించారు.. ఏం చేశారో మీకేమైనా అర్థం అవుతుందా? విజయ్ దేవరకొండపై రష్మిక సీరియస్
అందాల తార రష్మిక మందన్న ఏప్రిల్ 5వ తేదీన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు, ఫొటోలు, వీడియోలతో రకరకాలుగా విషెస్ తెలియజేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఆమెకు ఒకింత కోపం, నవ్వును తెప్పించాయి. దాంతో కొంత అసహనంగానే రష్మిక స్పందించారు. అసలు ఏమైందంటే..
డియర్ కామ్రేడ్ టీజర్‌తో పేరడి
రష్మికకు హ్యాపీ బర్త్ డే లిల్లీ అంటూ విజయ్ దేవరకొండ విషెస్ తెలియజేస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో డియర్ కామ్రేడ్ టీజర్‌ను అనుకరిస్తూ ఇద్దరు యువకులు కనిపించారు. విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకొన్న మాదిరిగానే ఓ యువకుడు వీడియోను మార్ఫింగ్ చేసి యూట్యూబ్‌లో వదిలాడు. అదే వీడియోను రష్మిక బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్విట్టర్లో ట్యాగ్ చేశాడు.
|
ఘాటుగా స్పందించిన రష్మిక
దాంతో రష్మిక మందన్న ఘాటుగా స్పందించింది. అబ్బాయిలు మీరేం అనుకొంటున్నారు. మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా? నా ఫ్యాన్స్‌కు గుండెపోటు తెప్పించినంత పనిచేశారు. అయ్యో జీసస్.. భరత కమ్మ.. మీరు చేసిన పనితో జీర్ణించుకోలేకపోతున్నాను అని రష్మిక ట్వీట్ చేశారు.
|
రష్మిక అప్సెట్ కావొద్దు అని
రష్మిక మందన్న గరం అయిందనే భావించిన విజయ్ దేవరకొండ మరో ట్వీట్ చేశాడు. ఏదో నిన్ను ఏడిపించేందుకు చేశాం. అప్సెట్ అవ్వకు. మా సెట్లో నీవు హ్యాపీగా ఉంటేనే మాకు ఆనందం. నీ ఫెర్ఫార్మెన్స్‌తో కంటతడి పెట్టించావు. నవ్వులతోనూ ముంచెత్తావు అని విజయ్ దేవరకొండ అన్నారు. మరోసారి హ్యపీ బర్త్ డే లిల్లీ.. 8వ తేదీన 11.11 గంటలకు నీకు తొలిపాటను డెడికేట్ చేస్తున్నాం అని ట్వీట్లో తెలిపారు.
డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మికతో..
కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం మే 31న రిలీజ్ అవుతున్నది. రష్మిక కెరీర్ పరంగా చూస్తే.. ఆమె కన్నడలో గణేష్ సరసన యజమాన చిత్రంలో నటిస్తున్నది. కార్తీ చిత్రం ద్వారా ఆమె తమిళంలోకి కూడా ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే.