రష్మిక మందన ఎమోషనల్ లెటర్.. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నా!

Recommended Video

Heroine Rashmika Mandanna Tweets About Her Decision

రష్మిక మందన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో, గీత గోవిందం చిత్రాల తరువాత రష్మిక స్థాయి మారిపోయింది. ఛలో చిత్రం రష్మికనిటాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తే, గీత గోవిందం చిత్రం రష్మికని క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది. ఆ చిత్రంలో చలాకి యువతిగా రష్మిక నటనకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్స్ అందుకుంటున్న సమయంలో రష్మిక వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. తన మాజీ ప్రియుడు రక్షిత్ నుంచి నిశ్చితార్థం జరిగాక రష్మిక విడిపోయింది. ఈ వార్త తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది.

కుటుంబ సభ్యులతో సహా

కుటుంబ సభ్యులతో సహా

రక్షిత్, రష్మిక విడిపోయిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. రష్మిక కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. రష్మిక కన్నడ చిత్రం కిరాక్ పార్టీలో రక్షిత్ సరసన నటించింది. ఆ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన విడిపోయారు.

 సినిమా నుంచి తప్పుకుని

సినిమా నుంచి తప్పుకుని

నిన్న తన ట్విట్టర్ అకౌంట్ లో రష్మిక చేసిన ప్రకటన మరింత సంచలనంగా మారింది. రష్మికకు వ్రిత్రా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి రష్మిక ఓకే చెప్పింది కూడా. కానీ కెరీర్ ఆరంభంలో తనకు ఇది సరైన చిత్రం కాదనే ఉద్దేశంతో తాను తప్పుకుంటున్నట్లు రష్మిక ప్రకటించింది.

ఊహాగానాలు

రక్షిత్ నుంచి విడిపోయిన తరువాత రష్మిక పూర్తిగా కన్నడ ఇండస్ట్రీకి దూరం అవుతోందని, అందువలనే వ్రిత్రా చిత్రం నుంచి రష్మిక తప్పుదుకుందని ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో రష్మికపై ట్రోలింగ్ కూడా మొదలయింది. ఈ ఊహాగానాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో తాజగా మరో ట్వీట్ చేసింది.

ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నా

ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నా

ఇన్నిరోజులు తాను సైలెంట్ గా ఉన్నానని అందుకు అంతా క్షమించాలి. కానీ నా గురించి వస్తున్న అనేక కథలు చూస్తున్న. కామెంట్స్ చేస్తున్నారు.. ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవన్నీ నన్ను తీవ్రంగా భాదిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరిని నేను నిందించడం లేదు.

ఇలాంటివి ఎవరూ కోరుకోరు

ఇలాంటివి ఎవరూ కోరుకోరు

తనపై వస్తున్న కథనాల గురించి స్పందిస్తూ., నేను కానీ, రక్షిత్ కానీ, మరెవరైనా ఇలాంటివి కోరుకోరు. నాణేనికి ఒకవైపు మాత్రమే చూసి నిర్ణయించవద్దు అని రష్మిక కోరింది. ఇండస్ట్రీలో పని చేస్తున్నవారంతా కొంత శాంతంగా ఆలోచించాలని అని రష్మిక కోరింది.

కన్నడ చిత్రాలు కూడా

కన్నడ చిత్రాలు కూడా


తాను ఇకపై కూడా కన్నడ చిత్రాలు చేస్తానని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఏ ఇండస్ట్రీలో పని చేసినా శక్తి వంచన లేకుండా కష్టపడుతానని రష్మిక క్లారిటీ ఇచ్చింది. తన కన్నడ చిత్రాల జర్నీ వ్రిత్రా చిత్రంతో ఆగిపోలేదని రష్మిక తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X