Don't Miss!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- News
వచ్చే ఎన్నికల్లో పోటీచేయడంలేదు.. YCP MLA కీలక ప్రకటన!
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రష్మిక మందన్న పొగరు వివాదం.. అలాంటివి కూడా భరించిందా?
తెలుగులో క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న రష్మిక మందన్న తాజాగా నటించిన ఓ కన్నడ చిత్రం వివాదంలో కూరుకుపోయింది. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఓ పాటను చిత్రీకరించారని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే య్యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్న ఈ వీడియోలో హీరోయిన్ రష్మికను అత్యంత దారుణంగా హింసించడంపై నిరసన వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

వివాదంగా పొగరు సినిమాలో పాట
కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం పొగరు అనే చిత్రంలో నటిస్తున్నది. ఆ సినిమా పాటను శ్రీరామనవమి రోజున విడుదల చేశారు. ఈ చిత్రంలో ధ్రువ సర్జా, రష్మికపై చిత్రీకరించిన పాట అత్యంత వివాదామైంది. కేవలం వారం రోజుల్లోనే ఈ పాటకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం గమనార్హం.

పాట థీమ్‌పై అభ్యంతరాలు
ధ్రువ సర్జా రౌడీగా నటిస్తున్న పొగరు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సగటు ప్రేక్షకుడు భరించ రాని విధంగా పాట థీమ్ ఉందనే వాదనను వ్యక్తం చేస్తున్నారు. పురుష అహంకారం, హింసాత్మక ధోరణితో పాట సాగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా నెటిజన్ల ఆగ్రహం
రష్మికను హీరో ధ్రువ హింసించిన, వేధించిన తీరుపై మహిళా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్త్రీలపై సమాజంలో దారుణమైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో హీరోలు మితిమీరి హింస, వేధింపులు, టీజింగ్‌లకు పాల్పడుతూ నటిస్తున్నారు. ఇది చాలా దారుణం అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
Recommended Video
మహిళలను వేధిస్తూ..
యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన ఖరాబు అనే వివాదాస్పద పాటపై నెటిజన్లు దారుణంగా స్పందిస్తున్నారు. చూడటానికే పాట చాలా దారుణంగా ఉంది. దర్శక, నిర్మాతలు బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మహిళలను వేధిస్తూ పాటలు చిత్రీకరిస్తే యువత కూడా అనుకరించే అవకాశం ఉంది అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఆ వివాదాస్పద వీడియో ఇదే..