రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ నిజమే.. అందుకే క్యాన్సిల్.. సుమన్ మందన్న వెల్లడి
అందాల భామ రష్మిక మందన్న, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ వార్తలకు తెరపడింది. రక్షిత్‌తో నిశ్చితార్థం రద్దు అయినట్టు రష్మిక తల్లి సుమన్ మందన్న అధికారికంగా వెల్లడించినట్టు కన్నడ మీడియా ధృవీకరించింది. దాంతో గత కొద్దిరోజులుగా వస్తున్న బ్రేకప్‌పై వస్తున్న రూమర్లు వాస్తవమని తేలిపోయింది. రష్మిక తల్లి వెల్లడించిన ప్రకారం..
Recommended Video


రష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్
రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు పొడసూపాయి. దాంతో వారి మధ్య చోటుచేసుకొన్న బేధాలను సరిదిద్దేందుకు ప్రయత్నించాం. వీలుకాని పక్షంలో ఇరు కుటుంబాలు నిశ్చితార్థం రద్దు చేయాలని నిర్ణయించాయి అని సుమన్ మందన్న తెలిపారు.

జీర్ణించుకోలేకపోతున్నాం
రష్మిక, రక్షిత్ నిశ్చితార్థం రద్దు కావడం ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇరు కుటుంబాలను ఈ వ్యవహారం కుంగదీసింది అని సుమన్ మందన్న వెల్లడించారు.

హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో
ఎవరి జీవితంలోనైనా ఒకరి వల్ల మరొకరు ఇబ్బంది పడకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాం అని సుమన్ వెల్లడించినట్టు కన్నడకు చెందిన బీటీవీ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది.

2017లో నిశ్చితార్థం
కిరిక్ పార్టీ సినిమా షూట్ సమయంలో రష్మిక, రక్షిత్ ప్రేమలో పడ్డారు. దాంతో వీరిద్దరికి 2017లో జూలైలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకొన్నారు.

రక్షిత్ శెట్టి గుడ్‌బై
రష్మికతో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అనంతరం రక్షిత్ శెట్టి సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పారు. సోషల్ మీడియాలో ఎప్పడూ బిజీగా ఉండే రక్షిత్ దాని నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో అభిమానులు సహనంతో ఉండాలని పేర్కొన్నారు.

బిజీగా బిజీగా సినిమాలతో
ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మిక మందన్న హవా కొనసాగుతున్నది. ఆమె నటించిన ఛలో, గీతా గోవిందం భారీ సక్సెస్‌ను సాధించాయి. మరో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆమె నటించిన దేవదాసు చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. అలాగే డియర్ కామ్రేడ్‌లో విజయదేవరకొండతో కలిసి నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











